వినాయకుడి పూజలో ఈ రంగు డ్రెస్సులు పొరపాటున కూడా వేసుకోకూడదు!

Published : Aug 27, 2025, 06:30 AM IST

చిన్నా, పెద్దా ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయకుడిని నిష్ఠతో పూజిస్తే కోరుకున్నవి ప్రసాదిస్తాడని నమ్మకం. అయితే వినాయకుడి పూజలో కొన్ని రంగుల దుస్తులు ధరించడం మంచిది కాదట. అవేంటో ఇక్కడ చూద్దాం. 

PREV
14
వినాయక చవితి 2025

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. చిన్నా, పెద్దా రంగు రంగుల దుస్తుల్లో మెరిసిపోతారు. కొత్త బట్టలు ధరించి.. భక్తి, శ్రద్ధలతో గణేషుడిని పూజిస్తారు. కొందరైతే ఫ్యామిలీ మొత్తం ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటారు. గణేషుడి అనుగ్రహం పొందడానికి ఆయనకు ఇష్టమైన పిండివంటలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అయితే గణేషుడి పూజలో కొన్ని రంగుల దుస్తులు వేసుకోవడం శుభప్రదం అయితే.. మరికొన్ని కలర్స్ నివారించడం మంచిది. అసలు ఏ రంగు దుస్తులు వేసుకోవచ్చు? ఏవి వేసుకోకూడదో ఇక్కడ చూద్దాం.  

24
వినాయక చవితి నాడు ఏ కలర్ దుస్తులు ధరించడం శుభప్రదం?

రెడ్ కలర్ :

గణపతికి అత్యంత ప్రీతికరమైన రంగు ఎరుపు. ఈ కలర్ శక్తి, ఉత్సాహం, విజయం, అభివృద్ధిని సూచిస్తుంది. గణపతి పూజలో ఎరుపు రంగు పువ్వులు సమర్పించడం.. రెడ్ కలర్ దుస్తులు ధరించడం శుభప్రదం. 

గులాబీ రంగు:

గులాబీ రంగు ప్రేమ, స్నేహం, సాంత్వనకు ప్రతీక. కుటుంబ సమతుల్యత కోసం వినాయకుడి పూజలో భక్తులు ఈ రంగు దుస్తులు ధరించవచ్చు.

34
ఆరెంజ్ కలర్

ఆధ్యాత్మికత, త్యాగం, భక్తిని సూచించే రంగు ఆరెంజ్. పూజల సమయంలో అత్యంత పవిత్రమైన రంగుగా భావిస్తారు. సాధారణంగా పూజారులు కూడా ఎక్కువ శాతం ఆరెంజ్ కలర్ దుస్తులే ధరిస్తుంటారు. 

తెలుపు రంగు:

శాంతి, పవిత్రకు చిహ్నం తెలుపు రంగు. వయసులో పెద్దవారు లేదా పూజా కార్యక్రమాల్లో నిమగ్నమైనవారు ఈ రంగు దుస్తులు ధరించవచ్చు. ఇది కూడా గణపతికి ఇష్టమైన రంగుగా చెప్తుంటారు. 

44
వినాయక చవితి నాడు నివారించాల్సిన రంగులు:

నల్ల రంగు:

బ్లాక్ కలర్ సాధారణంగా శోకానికి, నెగెటివ్ ఎనర్జీకి చిహ్నంగా చెప్తారు. పండుగలు, పూజా సమయాల్లో ఈ రంగు దుస్తులు ధరించకూడదని పండితులు చెబుతుంటారు.

డార్క్ బ్లూ, గ్రీన్ వంటి డార్క్ షేడ్స్:

ఈ కలర్స్ కూడా కొన్ని సందర్భాల్లో శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పూజా సమయాల్లో ప్రకాశవంతమైన రంగులు ధరించాలని సూచిస్తున్నారు.   

Read more Photos on
click me!

Recommended Stories