వినాయకుడి విగ్రహాన్ని ఎప్పుడు కొనాలి? ఎలాంటి విగ్రహాన్ని కొనాలి? ఏ దిశలో ప్రతిష్ఠించాలి?

Published : Aug 26, 2025, 05:31 PM IST

వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరు తమ ఇంట్లో గణేషుడి విగ్రహాలను ప్రతిష్ఠించి.. భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. అయితే వినాయకుడి విగ్రహాన్నికొనడానికి శుభముహుర్తం ఏంటి? విగ్రహాన్ని కొనే ముందు గమనించాల్సిన విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
17
వినాయక చవితి 2025

వినాయక చవితి పండుగ వచ్చేసింది. రేపటి నుంచి (ఆగస్టు 27) వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయక చవితినాడు ప్రతి ఒక్కరూ గణేషుడి విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠించి.. పూజించి, ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తుంటారు. వినాయక విగ్రహాలను ఒకటి, మూడు, ఐదు వంటి బేసి సంఖ్యలో కొనుగోలు చేస్తుంటారు. అయితే వినాయక విగ్రహాలు కొనే ముందు గమనించాల్సిన ఐదు విషయాలు, విగ్రహాలు కొనడానికి శుభ ముహూర్తం ఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాం.

27
విగ్రహాలు కొనడానికి శుభ ముహూర్తం

చవితి తిథి ఆగస్టు 26 మంగళవారం మధ్యాహ్నం 2:22 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి 27 ఆగస్టు సాయంత్రం 3:52 గంటల వరకు ఉంటుంది. అయితే వినాయక విగ్రహం కొనడానికి 26 ఆగస్టు సాయంత్రం 4:50 నుంచి 5:50 వరకు శుభ ముహూర్తం. లేదా సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు కొనవచ్చు. 27న కొనాలనుకునేవారు ఉదయం 9:10 నుంచి 10:20 వరకు కొనవచ్చు. వినాయక విగ్రహం కొనే ముందు ఈ కింది విషయాలను తప్పకుండా గమనించాలి.

37
తొండం దిశ

వినాయక విగ్రహాలు కొనేటప్పుడు ఆయన తొండం ఏ దిశలో ఉందో గమనించాలి. ఇంట్లో పూజించడానికి ఎడమ వైపు తొండం ఉన్న వినాయక విగ్రహాన్ని కొనాలి. ఈ వినాయకుడిని పూజిస్తే ఆనందం, విజయం కలుగుతాయి. కుడి తొండం కలిగిన విగ్రహాలను నివారించడం మంచిది. కుడి తొండం కలిగిన వినాయక విగ్రహాలను ఆలయాల్లో మాత్రమే పూజిస్తారు.

47
ఎలుకతో ఉన్న విగ్రహాలను కొనండి

వినాయక విగ్రహాలు కొనేటప్పుడు ఎలుకతో ఉన్న విగ్రహాలను చూసి కొనాలి. ఇలాంటి విగ్రహాలను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

57
కూర్చున్న విగ్రహాలను కొనాలి

వినాయక విగ్రహాలు కూర్చున్న భంగిమలో ఉండటం ముఖ్యం. కూర్చున్న భంగిమ వినాయకుడి ధ్యానం, స్థిరత్వం, ప్రశాంతతను సూచిస్తుంది. నిలబడి ఉన్న విగ్రహాలు వ్యాపార స్థలాలకు అనుకూలంగా ఉంటాయి. వినాయకుడి ముఖం ప్రశాంతంగా, సౌమ్యంగా ఉండేలా చూసుకోవాలి. కోపంగా లేదా విచారంగా ఉన్న ముఖ కవళికలు ఉన్న విగ్రహాలు ప్రతికూల శక్తిని తెస్తాయి.

67
మట్టి వినాయకుడిని కొనండి

మట్టితో చేసిన వినాయక విగ్రహాలను కొనడం మంచిది. పూజ తర్వాత వినాయక విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయాలనే నియమం ఉంది కాబట్టి.. మట్టి వినాయకుడు పర్యావరణానికి హాని కలిగించడు. సులభంగా నిమజ్జనం చేయవచ్చు. ఇంట్లోకి వినాయక విగ్రహాలు కొనేవారు పెద్ద విగ్రహాలను కొనకపోవడం మంచిది. రసాయనాలు, ఎక్కువ రంగులు వేసిన విగ్రహాలను నివారించాలి. 

77
ఏ దిశలో ఉంచాలి?

విగ్రహాలను కొన్న తర్వాత వాటిని ఉత్తర దిశగా చూసేలా ప్రతిష్టించాలి. దీన్ని శివుడు, లక్ష్మీదేవి దిశగా భావిస్తారు. ఈ దిశగా వినాయకుడి ముఖం ఉంటే వినాయకుడి ఆశీస్సులతో పాటు శివుడు, లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories