వినాయక చవితినాడు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? చూస్తే ఏమవుతుంది?

Published : Aug 24, 2025, 05:04 PM IST

వినాయక చవితి పండుగను ఏటా భాద్రపద మాసం, శుక్ల పక్ష చతుర్థి తేదీన జరుపుకుంటారు. కులమత భేదాలు లేకుండా ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. అయితే ఈ పండుగనాడు చంద్రుడిని చూడకూడదంటారు. అసలు ఎందుకు చూడకూడదు? చూస్తే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
వినాయక చవితి 2025

శ్రీ గణేషుని జన్మదినాన్ని మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక చవితి పండుగను జరుపుకోనున్నాం. చిన్నా, పెద్దా ఇష్టంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ముందుంటుంది. ఆ పండుగ నాడు ప్రతి ఒక్కరు వినాయకుడిని నిష్ఠగా పూజిస్తారు. కోరికలు నెరవేరాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తారు. అయితే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని చాలామంది పండితులు, పెద్దలు చెబుతుంటారు. కానీ ఆ రోజు వినాయకుడిని ఎందుకు చూడకూడదు? చూస్తే ఏమవుతుంది? అసలు దాని వెనుక కథ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

25
వినాయక చవితినాడు చంద్రుడ్ని ఎందుకు చూడకూడదు?

పురాణాల ప్రకారం.. వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాపనిందలు ( అకారణంగా పడే నిందలు లేదా అవమానాలు) వస్తాయనే నమ్మకం ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రసిద్ధ కథ చెబుతుంటారు పండితులు. అదేంటో చూద్దాం. 

ఒకసారి శ్రీ గణేశుడు.. బొజ్జ నిండా కుడుములు, ఉండ్రాళ్లు తిని.. తన వాహనమైన మూషికంపై ప్రయాణిస్తుంటాడు. మూషికం ఒక సర్పాన్ని చూసి భయపడి తడబడుతుంది. దీంతో వినాయకుడు మూషికంపై నుంచి కిందపడి.. పైకి లేవలేకపోతాడు. ఆ దృశ్యాన్ని చూసిన చంద్రుడు పగలబడి నవ్వుతాడు.

35
చంద్రుడిని చూస్తే ఏమవుతుందంటే?

చంద్రుడి నవ్వు.. గణేషుడికి కోపాన్ని తెప్పిస్తుంది. వెంటనే ఆయన చంద్రుడ్ని “ఈ రోజు నుంచి నిన్ను చూసినవారు అపవాదానికి లోనవుతారు.” అని శపిస్తాడు. అయితే వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినందుకు శ్రీ కృష్ణుడు, సప్తరుషుల భార్యలు నీలాప నిందలు మోయాల్సి వస్తుంది. దీంతో పార్వతీ దేవి ఈ సమస్యకు పరిష్కారంగా గణేషుడి కథ విని.. అక్షింతలు వేసుకోకుండా చంద్రుడిని చూడకూడదని చెబుతుంది. ఆ విధంగా వినాయక చవితినాడు చంద్రుని చూడకూడదనే నమ్మకం ఏర్పడింది. 

45
చంద్రుడిని పొరపాటున చూస్తే...

వినాయక చవితి నాడు చంద్రుడిని పొరపాటున చూసినవారు కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. గణేషుడిని భక్తి శ్రద్ధలతో పూజించి.. ఆయన కథ ఆసాంతం విని, అక్షింతలు తలపై వేసుకోవాలి. ఇలా చేస్తే నీలాపనిందలు రావని పండితులు చెబుతుంటారు. 

55
పేదవారికి దానం..

వినాయక చవితినాడు చంద్రుడిని చూసిన దోషం పోవాలంటే గణేషుడిని నిష్ఠగా పూజించి..  పూలు, పండ్లు సమర్పించాలి. వాటిని పేదవారికి దానం ఇవ్వాలి. పూర్తి భక్తి శ్రద్ధలతో గణేషుడి మంత్రాలను జపించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు, అపవాదులు రాకుండా ఉంటాయని నమ్మకం. 

Read more Photos on
click me!

Recommended Stories