వినాయక చవితి పండుగ చాలా ప్రత్యేకమైంది. ఆ రోజున నిష్ఠతో గణేషుడిని పూజిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలు రావని.. సిరి సంపదలు సిద్ధిస్తాయని నమ్మకం. అయితే వినాయక చవితినాడు కొన్ని పనులు చేయడం అస్సలు మంచిది కాదట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వినాయక చవితి నాడు గణేషుడిని పూజించడం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ పర్వదినాన భక్తులు గణేశుడిని భక్తి, శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజించాలి. వినాయక చవితినాడు కొన్ని పనులు చేయకూడదని పురాణాలు, ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
25
వినాయక చవితినాడు అస్సలు చేయకూడని పనులు:
చంద్రుడిని చూడకూడదు:
వినాయక చవితినాడు చంద్రుని చూడటం మంచిది కాదని చెబుతారు. పురాణాల ప్రకారం గణేశుడు తన వాహనమైన మూషికంపై ప్రయాణిస్తున్నప్పుడు కింద పడిపోతాడు. అది చూసి చంద్రుడు నవ్వుతాడు. అందుకు గణేషుడికి కోపం వచ్చి చంద్రుడిని శపిస్తాడు. “ఈ రోజు నిన్ను చూసినవారికి అపవాదం కలుగుతుందని.” ఈ కారణంగా వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని చెబుతారు.
తులసిని వినాయకుడికి సమర్పించకూడదు:
సాధారణంగా తులసి విష్ణువు మూర్తికి ప్రియమైనది. కానీ గణపతికి తులసి సమర్పించడం నిషిద్ధం. పురాణాల ప్రకారం తులసి దేవి గణేశునికి వివాహ ప్రతిపాదన చేసిందట. గణేశుడు తిరస్కరించడంతో తులసి శపిచిందట. గణపతి కూడా ఆమెను శపించాడని కథ ఉంది. అందుకే గణపతి పూజలో తులసిని వాడకూడదని పండితులు చెబుతుంటారు.
35
మాంసాహారం, మద్యపానం:
వినాయక చవితి చాలా పవిత్రమైన పండుగ. ఆ రోజున శుచి, శుభ్రం పాటించాలి. మంచి స్వభావం, ధార్మిక ఆలోచనలతో ఉండాలి. మాంసాహారం, మద్యపానం, ధూమపానం వంటివి చేయకూడదు.
వీరు పూజ చేయకూడదు:
పండితుల ప్రకారం.. గణపతి పూజ సమయంలో అశుద్ధ వస్త్రాలు ధరించకూడదు. మరణం లేదా జనన సందర్భంలో ఉన్నప్పుడు గణపతికి పూజ చేయకూడదు. గర్భిణీలు శుద్ధిగా ఉండాలి కానీ.. అధిక శ్రమతో కూడిన కార్యాలు చేయకూడదు. పూజ అనేది ఆధ్యాత్మిక భావన. మనసుకు ప్రశాంతనిచ్చే సాధనం. కాబట్టి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత, ఆయనను ఒంటరిగా వదిలిపెట్టకూడదు. విగ్రహం ఉన్న స్థలంలో ఎవరైనా ఉండాలి. లేదా దీపం వెలిగించి భక్తి శ్రద్ధతో పర్యవేక్షించాలి.
కోపం, అసభ్య మాటలు:
వినాయక చవితి నాడు శాంతి, భక్తి, శ్రద్ధ చాలా అవసరం. కుటుంబంలో గొడవలు, కోపావేశాలు, అసభ్య పదజాలం వాడటం వంటివి.. పూజ శుద్ధిని ధ్వంసం చేస్తాయని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి.
55
విగ్రహాన్ని వెంటనే నిమజ్జనం చేయకూడదు:
వినాయకుని ప్రతిష్టించిన తర్వాత ఆయనను కనీసం ఒక్క రోజు భక్తితో పూజించాలి. పూజ చేసిన వెంటనే విగ్రహాన్ని నిమజ్జనం చేయడం సరికాదు. గణేశుడికి 1, 3, 5, 7, 9, 11 రోజుల పాటు నివేదన చేసి నిమజ్జనం చేయడం సంప్రదాయం.