వాస్తు శాస్త్రంలో దిశలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీని ప్రకారం.. ప్రతి వస్తువు లేదా ప్రతి పనికి దిశా నిర్దేశం చేస్తే.. మీరు అన్ని విధాలా ప్రయోజనాలను పొందుతారు. ఇలాంటి సమయంలో మీరు పూజ చేసేటప్పుడు దిశలను జాగ్రత్తగా చూసుకుంటే పూజా ఫలితాలను పొందుతారు. మరి వాస్తు ప్రకారం.. పూజ చేసేటప్పుడు ఏ దిశలో ముఖం పెట్టి కూర్చోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇదే బెస్ట్ డైరెక్షన్..
వాస్తు శాస్త్రం ప్రకారం.. పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వాస్తు ప్రకారం.. ఈ దిశను సానుకూల శక్తికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు. అందుకే పూజ చేసేటప్పుడు మీరు ఈ దిశలో ఉండి దేవుడిని పూజిస్తే ఎన్నో రెట్లు ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా తూర్పు దిక్కున ముఖం పెట్టి పూజించడాన్ని కూడా శుభప్రదంగా భావిస్తారు.
లక్ష్మీ దేవిని ఎలా పూజించాలి?
హిందూ మతంలో.. లక్ష్మీదేవిని సంపద దేవతగా భావిస్తారు. అందుకే మీరు ఉత్తరం దిక్కు మొకం పెట్టి అమ్మవారిని పూజిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సిరి సంపదలు కూడా కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు లక్ష్మీదేవి మంత్రాలను పఠించండి.
ఇంటి గుడిలో ఈ నియమాలు పాటించండి
మీ ఇంట్లో దేవుడి గుడి కట్టేటప్పుడు దిశను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ దేవుడి గుడి తలుపులుఎప్పుడూ కూడా తూర్పు వైపే ఉండాలి. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ఎన్నో ప్రయోజనాలను కూడా పొందుతారు. అలాగే సూర్యకిరణాలు, స్వచ్ఛమైన గాలి వచ్చే విధంగా ఆలయానికి ఒక స్థలాన్ని ఎంచుకోవాలి. మీరు ఈ నియమాలను పాటిస్తే గనుక వాస్తు దోషం కూడా పోతుంది.