దీపావళి 2023: సంపదల దేవతను అష్టలక్ష్మీ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

First Published | Nov 12, 2023, 12:12 PM IST

Diwali 2023: లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారికి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్మతారు. ఎందుకంటే హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సుకు దేవతగా భావిస్తారు. కానీ  లక్ష్మీదేవిని అష్టలక్ష్మీ అని కూడా పిలుస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారో తెలుసా? 
 

Diwali 2023: ప్రతి వ్యక్తి లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఎప్పుడూ ఉండాలని కోరకుంటారు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావనే నమ్మకం. లక్ష్మీదేవిని విష్ణువు, ఆదిశక్తి భార్యగా కూడా పిలుస్తారు. లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సంపద, సౌభాగ్యాలను పొందుతానని నమ్ముతారు.
 

అష్టలక్ష్మీ రూపం ప్రాముఖ్యత 

లక్ష్మీదేవి ఒకటి కాదు ఎనిమిది రూపాలు అని అందరికీ తెలుసు. అందులో ఒక రూపమే అష్టలక్ష్మి. అష్టలక్ష్మీ పేరు ప్రకారం.. శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలలో నమ్ముతారు. అందుకే భక్తులు తమ కోరికలను నెరవేరడానికి లక్ష్మీదేవి వివిధ రూపాలను పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. 
 

Latest Videos



అష్టలక్ష్మీదేవి ఎనిమిది రూపాలు

1. మొదటి రూపం - ఆదిలక్ష్మి లేదా మహాలక్ష్మి: ఈ రోపాలను లక్ష్మీదేవి మొదటి రూపంగా భావిస్తారు. సుఖసంతోషాలు, సిరి సంపదలు పొందడానికి లక్ష్మీదేవిని పూజిస్తారు. పురాణాల ప్రకారం.. సృష్టిలోని ముగ్గురు దేవతలను మహాలక్ష్మి ఆవిష్కరించింది. దీనితో సృష్టి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మహాకాళి, మహాసరస్వతి మహాలక్ష్మి నుంచి వచ్చారు. లక్ష్మీదేవి మొదటి రూపమైన ఆదిశక్తి జీవులకు జీవం పోస్తుందని నమ్ముతారు.
 

2. రెండో రూపం - ధనలక్ష్మి. పేరుకు తగ్గట్టుగానే ధనలక్ష్మిని సంపదకోసం పూజిస్తారు. ఈ  అమ్మవారిని పూజించడం వల్ల ఋణం నుంచి విముక్తి పొందుతారని నమ్మకం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తిని కుబేరుడి ఋణం నుంచి విముక్తి చేయడానికి లక్ష్మీదేవి ధనలక్ష్మి రూపం ధరించింది. ధనలక్ష్మీ దేవి రూపం గురించి చెప్పాలంటే ధనలక్ష్మికి ఒక చేతిలో ధనం, ఒక చేతిలో తామర పువ్వులు ఉంటాయి.
 

3. మూడో రూపం - ధాన్యలక్ష్మి.  ధాన్యలక్ష్మీ అంటే ఆహార సంపద. ఈ  రూపాన్ని ఎప్పుడూ పూజిస్తే మీ ఇంట్లో ఆహార వనరులకు ఎలాంటి కొదవ ఉండదు. ధాన్యలక్ష్మిని అన్నపూర్ణ రూపంగా భావిస్తారు. అలాగే ఆమెను వ్యవసాయం, పంటల దేవతగా కూడా భావిస్తారు. 

4. నాల్గో రూపం -  గజలక్ష్మి. గజలక్ష్మి తామర పువ్వు పైన కూర్చొని దానికి ఇరువైపులా ఏనుగులను కలిగి ఉంటుంది. అందుకే ఆమెను గజలక్ష్మి అని పిలుస్తారు. రెండు వైపులా ఉన్న ఏనుగులు తమ తొండంలో ఉన్న నీటితో గజలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేస్తాయి. నమ్మకాల ప్రకారం.. గజలక్ష్మి పశుదాత. సముద్రపు లోతుల్లో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందడానికి ఇంద్రదేవునికి సహాయం చేసింది.
 

5. ఐదో రూపం - సంతాన లక్ష్మిని లక్ష్మిదేవి ఐదో రూపంగా పరిగణిస్తారు. పేరుకు దగ్గట్టుగా ఈ లక్ష్మీదేవిని పూజించడం వల్ల పిల్లల సంతోషాన్ని పొందుతారు. అమ్మవారి ఒడిలో ఒక బిడ్డ, రెండు చేతుల్లో కుండలు, ఒక కత్తి, కవచం ఉంటాయి. ఈ రూపం స్కందమాతను పోలి ఉంటుంది. అందుకే స్కందమాత, సంతానలక్ష్మిని సమానంగా భావిస్తారు.
 

6. ఆరో రూపం - లక్ష్మీదేవి ఆరవ రూపం ధైర్యలక్ష్మీ. పేరుకు తగ్గట్టుగానే ఈ రూపం జీవిత పోరాటాలను జయించే ధైర్యాన్ని అందిస్తుంది. ధైర్యలక్ష్మీ ఎనిమిది చేతులలో వివిధ రకాల ఆయుధాలను ధరిస్తుంది. యుద్ధంలో విజయం సాధించాలనే వారు ఈ అమ్మవారిని ఆరాధిస్తారు.
 

Diwali 2023

7. ఏడవ రూపం - విజయలక్ష్మిని అష్టలక్ష్మి ఏడవ రూపంగా భావిస్తారు. ఇక్కడ గెలుపు అంటే విజయం. లక్ష్మీదేవి ఈ రూపం తన భక్తులకు అభయాన్ని అందిస్తుంది. అందుకే మీరు  ఏదైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు విజయలక్ష్మీని ఆరాధించండి. 

8. ఎనిమిదవ రూపం - విద్యాలక్ష్మిని అష్టలక్ష్మి ఎనిమిదవ రూపంగా భావిస్తారు. తన పేరులాగే విద్యాలక్ష్మి విద్యను, జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తుల మేధోశక్తి కూడా పెరుగుతుంది.

click me!