కార్తీక మాసాన్ని ఎందుకు జరుపుకుంటాం
కార్తీక మాసం శివుడు, మహావిష్ణువుకు అంకితం చేయబడిన పండుగ. దీనిని నెల రోజుల పాటు జరుపుకుంటాం. ఈ మాసంలో మొదటిది ఆశ్వయుజ శుక్ల పౌర్ణమి. వైష్ణవులు, శైవులు ఇద్దరూ ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా, అదృష్టంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో శివకేశవులను పూజించడం వల్ల శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు. కార్తీక మాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది.
కార్తీక మాసంలో శివ భక్తులు ఉపవాసం ఉంటారు. ఎన్నో వ్రాతాలు చేస్తారు. అలాగే ప్రతి సోమవారం ఉపవాసాలు ఉంటారు. ఈ మాసంలో దానాలు చేయడం ఎంతో శుభప్రదంగా కూడా భావిస్తారు. అందుకే ఈ మాసంలో వస్త్రదానం, స్వర్ణదానం, గోదానం వంటివి చేస్తుంటారు. ఇవి పరమేశ్వరుడి అనుగ్రహం పొందేలా చేస్తాయని భక్తుల నమ్మకం.