Spiritual: మంచం కింద ఈ వస్తువులు పెడుతున్నారా.. అయితే దరిద్రం కొని తెచ్చుకున్నట్లే?

First Published | Sep 1, 2023, 10:11 AM IST

Spiritual: వాస్తు శాస్త్రం ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో కచ్చితంగా చెప్పింది. వాస్తు శాస్త్రం ప్రకారం మంచం కింద ఇలాంటి వస్తువులు పెడితే దరిద్రం తాండవిస్తుందట. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
 

వాస్తు శాస్త్రంలో చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద సమస్యలకు తయారుచేస్తాయి. అయితే పడకగదిలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల సానుకూల శక్తిని ఎలా పెంచుకోవాలో వాస్తు శాస్త్రం చూపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీ మంచం తూర్పు లేదా దక్షిణ వైపు ఉంచాలి.
 

మంచం యొక్క తల తూర్పు దిశని ఎదుర్కోవాలి. అలాగే పడక గదిలో ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఉంచకండి. అలాగే పొరపాటున మంచం కింద ఇనుప వస్తువులు పెట్టకండి. దీనివలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్యాభర్తల మధ్యన అనురాగం  తగ్గిపోతుంది.


అలాగే మంచం కింద ఎట్టి పరిస్థితులలోనూ గాజులు పెట్టకండి. దాని వలన కూడా అపారమైన నష్టం సంభవిస్తుంది. అలాగే మన తల వెనుకగా అద్దం ఉండకుండా చూసుకోండి. అలాగే పొరపాటున మంచం కింద ఎప్పుడు చీపురు కట్టలు పెట్టకండి.

ఇది భార్యాభర్తల మధ్యన విభేదాన్ని సృష్టిస్తుంది. అలాగే చెప్పులు, బూట్లు లాంటివి కూడా నిద్రించే మంచం కింద పెట్టకండి. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతాయి.

అలాగే పాడైపోయిన ఎలక్ట్రిక్ వస్తువులు కూడా  మంచం కింద పెట్టకండి. అలాగే పడుకునేటప్పుడు వాడుతున్న ఎలక్ట్రిక్ వస్తువులను మంచం మీద ఉంచుకొని పడుకోకండి. దీనివలన నిద్రాభంగం జరగడమే కాకుండా ఆ ప్రభావం మన ఆరోగ్యం మీద కూడా పడుతుంది.

అలాగే ఏడుస్తున్న చిత్రపటాలను మన పడకగదిలో లేకుండా చూసుకోండి. ఇలాంటి చిన్న చిన్న వాస్తు చిట్కాలతో ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చును. ఇప్పటికైనా ఇలాంటి వస్తువులు మంచం కింద ఉంటే తీసి బయటపడేయడం ఉత్తమం.

Latest Videos

click me!