Raksha Bandhan
raksha bandhan 2023: సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు నియమాలను పాటించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయట. వాస్తు దోషం కారణంగా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. మొత్తమ్మీద ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. వాస్తు శాస్త్రంలో రాఖీ పండుగ రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే ఈ సమస్య ఉండదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే శ్రావణ పూర్ణిమ నాడు అంటే రాఖీ పండుగ రోజు ఈ వాస్తు చర్యలను ఖచ్చితంగా చేయండి. అవేంటో తెలుసుకుందాం-
వాస్తు పరిహారాలు
సనాతన ధర్మంలో పూర్ణిమ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అలాగే శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే రాఖీ పండుగ రోజున ఇంట్లో తులసి మొక్కను నాటండి. పౌర్ణమి రోజున తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొంటాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆదాయం, అదృష్టం కూడా పెరుగుతాయి. ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కను నాటాలి.
వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లో ముళ్ల మొక్కలను నాటకూడదు. మీకు తెలియకుండానే ఇంట్లో ఏ దిశలోనైనా ముళ్ల మొక్క ఉంటే రాఖీ పండుగ రోజున ముళ్ల మొక్కను తొలగించండి. దీనికి బదులుగా ఇంట్లో పచ్చని మొక్కలను నాటండి. అరటి, తులసి మొక్కలను నాటొచ్చు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే డబ్బు కూడా వస్తుంది.
Raksha Bandhan 2023
ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి రాఖీ పండుగ రోజున స్నానం చేసి, ధ్యానం చేయండి. ఆ తర్వాత సంపద దేవత అయిన విష్ణువును, లక్ష్మీ దేవిని ఆరాధించండి. ఈ సమయంలో స్వచ్ఛమైన నెయ్యి దీపాలు వెలిగించి విష్ణుమూర్తికి హారతి ఇచ్చి సుఖ సంతోషాలు, సంపదలు పెరగాలని కోరుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే మీ సంపద కూడా పెరుగుతుంది.
Raksha Bandhan 2023- 5 houghtful Financial Gifts That Your Sister Will Appreciate
మీ ఆర్థిక సమస్యలు పోవాలంటే శ్రావణ పూర్ణిమ అంటే రాఖీ పండుగ రోజున ఇంటిని శుభ్రం చేయండి. ఆ తర్వాత నీటిలో చిటికెడు పసుపు వేసి తుడవాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి పరిమాణంలో ఉంటాడు. కాబట్టి రాఖీ పండుగ రోజున శివుడిని, చంద్రుడని పూజించండి. ఇందుకోసం స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత శివుడికి పచ్చిపాలతో అభిషేకం చేయండి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా శివునితో పాటు చంద్రదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు, సంక్షోభాలు తొలగిపోతాయి. పాలు, పెరుగు, మిష్రీ వంటి వాటిని దానం చేయొచ్చు.