లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఎలాంటి ఆర్థిక సమస్యలు రావని నమ్ముతారు. అందుకే ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇల్లు సుఖసంతోషాలతో, ఆనందంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం పొందడానికి ప్రతి ఏడాది వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని పెళ్లైన ఆడవారు చేస్తారు. తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించే శుభదినం వరలక్ష్మీ వ్రతం. వరలక్ష్మీ వ్రతం పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు వరలక్ష్మీ వ్రతం కాబట్టి.. ఈ రోజున కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు విషెస్ ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా లక్ష్మీదేవి మీకు ఆనందాన్ని ప్రసాదించాలని, అష్టలక్ష్మీ మీ జీవితాన్ని ఆరోగ్యం, సంపద, స్వేచ్ఛతో నింపాలని కోరుకుంటున్నాను. వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు
నమస్తే మహామాయే, శ్రీ పీఠే సుర పూజితే. శంఖచక్రగదాహస్తే, మహాలక్ష్మీ నమోస్తుతే..! హ్యాపీ వరమహాలక్ష్మి
మీకు, మీ కుటుంబ సభ్యలలకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. మీ ఇల్లు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను
ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆశీస్సులు కురిపించాలి.. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం
మీకు, మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. మీరు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీ జీవితంలో ఇకనుంచి అన్ని ఆనందాలే ఉండాలి.
ఈ పవిత్రమైన రోజున అమ్మవారికి ఉపవాసం ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు. వరమహాలక్ష్మి మీకు అనుగ్రహం చూపించుగాక.
ఈ వరలక్ష్మీ వ్రతం పర్వదినాన అష్టలక్ష్మీ మీ కలలను నెరవేర్చాలి. మీ ఆర్థిక సమస్యలన్నీ పోవాలని.. వరలక్ష్మీ శుభాకాంక్షలు
శ్రీ (సంపద), భూ (భూమి), సరస్వతి (విద్య), ప్రీతి (ప్రేమ), కీర్తి (కీర్తి), శాంతి (శాంతి), తుష్టి (ఆనందం), పుష్టి (బలం). ఇవన్నీ మీకు కలగాలని.. వర మహాలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.
శ్రీమహాలక్ష్మి స్వరూపమైన వరలక్ష్మీ దేవి ఈ పవిత్రమైన రోజున మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆశీస్సులు కురిపించాలి. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం.