వరలక్ష్మీ వ్రతం: ఈ రోజు వీటిని ఇంటికి తీసుకొస్తే మీ సిరి, సంపదలు పెరుగుతాయి.. ఆర్థిక సమస్యలు పోతాయి

First Published | Aug 25, 2023, 10:11 AM IST

ఈ రోజు లక్ష్మీదేవిని నిష్టగా పూజిస్తారు. సనాతన ధర్మంలో వరలక్ష్మీ దేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి తన భక్తుల కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. మరి ఈ రోజు ఇంట్లోకి ఎలాంటి వస్తువులను తేవాలంటే? 
 

సనాతన ధర్మంలో లక్ష్మీదేవికి ప్రత్యేక స్థానముంది. లక్ష్మీదేవిని సిరి, సంపదలకు ప్రతీకగా కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖ సంతోషాలు, శాంతి, సంపద, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. హిందూ మతంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందుకే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపకుంటారు. ఇక ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 25 అంటే ఈ రోజే వచ్చింది. ఇక ఈ వ్రతం చేసే మహిళలు నిష్టగా అమ్మవారికి ఉపవాసం ఉంటారు. ఈ రోజు నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తే వరాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. 

వరలక్ష్మీ వత్రం ప్రాముఖ్యత

ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ఉపవాసం ఉండటం వల్ల అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఉపవాసం ఉండటం వల్ల పేదరికం పూర్తిగా తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే వీరికి ఉన్న బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. అంతేకాదు ఈ వ్రతం సంతోషం, శ్రేయస్సును కలిగిస్తుంది. 
 

Latest Videos


లక్ష్మీదేవికి ఇష్టమైనవి

వరలక్ష్మీ వ్రతం రోజున ఇంట్లోకి కొబ్బరి కాయను తీసుకురావాలి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని నమ్ముతారు. కొబ్బరి కాయ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో ఒకటిగా భావిస్తారు. దీన్ని ఇంట్లో పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆవీస్సులు మీపై ఉంటాయట. 
 

పసుపు రంగు వస్త్రం

పసుపును కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా భావిస్తారు. ఈ వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించిన తర్వాత 11 గాజలును పసుపు వస్త్రంలో చుట్టి ఉత్తరదిశలో ఉంచాలి. 
 

శంఖం

లక్ష్మీదేవికి దక్షిణ శంఖం ఎంతో ఇష్టమట. పురాణాల ప్రకారం.. లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుందని నమ్ముతారు. సముద్ర మంథనంలో ఉద్భవించిన 14 రత్నాలలో ఇది ఒకటి. ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ఇంట్లోకి శంఖంను తీసుకురావడం వల్ల ధన సమస్యలు పోతాయని నిమ్ముతారు.

పారిజాత పువ్వుల మొక్క

పారిజాత పువ్వుల మొక్కను హర్సింగార్ అని కూడా అంటారు. ఈ మొక్క లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ రోజు ఈ మొక్కను మీ ఇంట్లోకి ఖచ్చితంగా తీసుకురండి. అలాగే నాటండి.

click me!