వైకుంఠ ఏకాదశి 2025: పూజాఫలం దక్కాలంటే ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?

First Published | Jan 9, 2025, 10:35 AM IST

వైకుంఠ ఏకాదశి 2025: వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు భక్తులు ఉపవాసం ఉన్నా, లేకున్నా కొన్ని పనులకు దూరంగా ఉండాలి. లేదంటే మీరు పూజ చేసిన ఫలం కూడా దక్కదు. 

హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైకుంఠ ఏకాదశి పండుగను ప్రతి ఏడాది మార్గశుర్ష మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి జనవరి 10 న వచ్చింది. వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నాడు వ్రతాలు, దానధర్మాలు చేస్తారు.

అలాగే భక్తులు దేవుడికి ఉపవాసం ఉంటారు. చాలా మంది  ఈ పవిత్రమైన రోజులు శ్రీమహావిష్ణు భక్తులు దేవుడి ఆశీర్వాదం, అనుగ్రహం పొందడానికి నిష్టగా ఉపవాసం ఉంటారు. కానీ మీకు పూజా పుణ్యఫలం దక్కాలంటే మాత్రం వైకుంఠ ఏకాదశి నాడు కొన్ని పనులను చేయకుండా ఉండాలి. అలాగే కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వైకుంఠ ఏకాదశి 2025: చేయాల్సినవి ఇవే

1. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి  నాడు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లాలి. దర్శనం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆలయానికి వెళ్లకపోతే మీ ఇంట్లో ఉన్న మహావిష్ణువు విగ్రహాన్ని పూజించండి. దీపాలు, పూలతో అలంకరించండి. 

2. చాలా మంది వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు. దీనికి ఫలితం దక్కాలంటే శ్రీ మహావిష్ణు పవిత్ర మంత్రాలను ఖచ్చితంగా పఠించండి. దీనివల్ల మీ హృదయం శుద్ధి చెందుతుంది. అలాగే మీకు ఆధ్యాత్మిక పరిపూర్ణత దక్కుతుందని పండితులు చెబుతున్నారు. 


3. ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు భగవద్గీతను చదవడం ఎంతో శుభప్రదమని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ రోజు భగవత్ గీతలో  ఉన్న శ్లోకాలను పఠిస్తూ ఉపవాసాన్ని పూర్తి చేయండి. 

4. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలంటే ఈ రోజు ఉపవాసం ఉండాలని పండితులు చెబుతున్నారు. 

5. వైకుంఠ ఏకాదశి పూజా ఫలం దక్కాలంటే మీరు ఈ రోజు పేదలకు దానధర్మాలు చేయండి. 
 

వైకుంఠ ఏకాదశి 2025: చేయకూడని పనులు

1. శాస్త్రాల ప్రకారం.. ముక్కోటి ఏకాదశి నాడు అన్నం తినకూడదు. 

2. అన్నం ఒక్కటే కాదు ఉల్లిగడ్డ, వెల్లుల్లి కూడా తినకూడదు. అలాగే మాంసాహారం కూడా వైకుంఠ ఏకాదశి నాడు తినకూడదు. 

3. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు సమయం కంటే ముందే ఉపవాస దీక్షను విరమించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. .

4. పూజా ఫలం దక్కాలంటే ఈ రోజు ఎవ్వరితోనూ చెడుగా మాట్లాడకూడదు. ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలి. మర్యాదగా మాట్లాడాలి. 
 

వైకుంఠ ఏకాదశి సమయం 2025

హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైకుంఠ ఏకాదశి తిథి జనవరి 9 న మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే జనవరి 10న రాత్రి 10.19 గంటలకు ముగుస్తుంది. అయితే వైకుంఠ ఏకాదశి శుభ ముహూర్తాన్ని జనవరి 10న నిర్వహించనున్నారు.

సుముహూర్తం

బ్రహ్మ ముహూర్తం - ఉదయం 05:27 నుంచి 06:21 వరకు

గోధులి ముహూర్తం - సాయంత్రం 05:40 నుంచి 06:07 వరకు అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నం 12:08 నుండి 12:50 వరకు

Latest Videos

click me!