వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండేవారు పాటించాల్సిన నియమాలు ఇవే..

First Published | Dec 23, 2023, 9:37 AM IST

Vaikuntha Ekadashi 2023: ఈ రోజు వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా భక్తులంతా శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అలాగే ఉపవాసం ఉంటారు. మరి ఈ రోజు వ్రతం చేస్తూ ఉపవాసం ఉండేవారు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

వైకుంఠ ఏకాదశి

వైకుంఠ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. అందుకే ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజున విష్ణుమూర్తి స్వర్గ నివాసమైన వైకుంఠం తలుపులు తెరిచే ఉంటాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏకాదశి నాడు విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొంటారు. దీనిలో మోక్షాన్ని కోరుకుంటారు. ఈ రోజు విష్ణుమూర్తి అనుగ్రహం పొందితే ఈ భూమ్మీద తమ ప్రయాణం ముగిసిన తర్వాత విష్ణువు పవిత్రమైన నివాసంలో ఆశ్రయం లభిస్తుందని నమ్మకం. మరి ఈ ఏకాదశి తిథి నాడు ఉపవాసం లేదా వ్రత నియమాలు ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వైకుంఠ ఏకాదశి

1. మీరు ఇంతకు ముందెప్పుడూ ఉపవాసం ఉండకపోయినా, ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్టైనా.. మీరు డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే ఉపవాసం ఉండండి. ఎందుకంటే రోజంతా రెగ్యులర్ డైట్ లేకుండా ఉండటం అంత సులభం కాదు. అందుకే మీరు ఉపవాసం ఉండాలనుకుంటే మీ శరీరం అందుకు తట్టుకునే విధంగా బలంగా ఉందో? లేదో? డాక్టర్ ను అడిగి తెలుసుకోండి. 

2. వైకుంఠ ఏకాదశి వ్రతం సాధారణంగా దశమి తిథికి ఒక రోజు ముందే మొదలవుతుంది. అందుకే కొంతమంది విష్ణు భక్తులు దశమి రోజు భోజనం చేయరు. 


వైకుంఠ ఏకాదశి

3. ఈ రోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

4. ఏకాదశి తిథి నాడు.. బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందన్న మాట. 

5. ధ్యానం తర్వాత ప్రతిజ్ఞ చేసి ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించండి.
 

వైకుంఠ ఏకాదశి

6. వైకుంఠ ఏకాదశి నాడు బియ్యం, గోధుమలు, కాయధాన్యాలను తినకూడదు. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. అంతేకాదు ఈ రోజు వెల్లుల్లి, ఉల్లిపాయలు లేదా మాంసాన్ని తినకూడదు.

7. అయితే ఈ రోజు సబుదానా కిచిడీ, సాబుదానా వడ, సింఘారే కీ పూరీ, ఆలూ సబ్జీ వంటి పండ్లు, పాలు, వ్రత వంటకాలను తీసుకోవచ్చు.

8. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' మంత్రాన్నిఎంత ఎక్కువ సార్లు అంటే అంత మంచిది. అందుకే భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించండి.
 

వైకుంఠ ఏకాదశి

9. విష్ణు సహస్రనామాన్ని పఠించండి. 

10. ఈ రోజు దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొనండి. అలాగే మీకు చేతనైన సాయం చేయండి. 

11. ఈ రోజు ప్రశాంతంగా ఉండండి. దురుసుగా, అమర్యాదగా మాట్లాడకండి. ఎవ్వరినీ కించపర్చకండి. 

Latest Videos

click me!