Numerology Birthdates ఈ తేదీల్లో పుట్టినవారు రిస్కుకి ఎదురెళతారు.. విజయాల్ని ఒడిసి పడతారు!

మీరు పుట్టిన తేదీ ఆధారంగా మీ వ్యక్తిత్వం, మీ భవిష్యత్తు గురించి చెబుతుంది సంఖ్యాశాస్త్రం. ఇప్పుడు 4 తేదీల్లో జన్మించినవారి గుణగణాలు తెలుసుకుందాం. 13, 22, 31 తేదీలలో జన్మించినవారిని సైతం 4 సంఖ్యగానే పరిగణిస్తారు. ఆ  అంకెలను కూడితే 4 సంఖ్య వస్తుంది. 

Unlocking your destiny numerology insights for birthdates 4 13 22 and 31 in telugu

సంఖ్యా శాస్త్రం ప్రకారం 1 నుండి 9 వరకు ప్రతి సంఖ్యపైనా గ్రహాల ప్రభావం ఉంటుంది. వాటి స్థతిగతుల ఆధారంగానే వ్యక్తి ప్రవర్తన, సుఖసంతోషాలు నిర్ణయించబడతాయి.  

Unlocking your destiny numerology insights for birthdates 4 13 22 and 31 in telugu

నెల ఏదైనా.. 4, 13, 22 లేదా 31 తేదీల్లో జన్మించిన వ్యక్తుల సంఖ్య 4.. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ సంఖ్యకు రాహువు గ్రహం అధిపతి. ఇది వీళ్లని ఇతరులలో భిన్నంగా, ప్రత్యేకంగా నిలుపుతుంది. సమాజంలో ఎక్కువ గుర్తింపు కలగజేస్తుంది. వీళ్లని సమాజంలో ప్రత్యేకమైన వర్గంగా గుర్తిస్తారు.


4వ నంబర్ వ్యక్తులు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు.  తలపెట్టిన పనిలో విజయం సాధించడానికి శాయశక్తులా కృషి చేస్తారు. వారు తమ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ప్రారంభించిన పని పూర్తయ్యేదాకా దేన్నీ పట్టించుకోరు.

ఈ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు. వారు ఫలితం గురించి పట్టించుకోరు. సానుకూలంగా, ప్రతికూలంగా.. ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరిస్తారు. ఎక్కువ కాలం నాన్చకుండా వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు.

కెరీర్ గురించి మాట్లాడితే, 4వ నంబర్ వ్యక్తులు మీడియా, రాజకీయాలు, న్యాయశాస్త్రం వంటి రంగాలలో ఎక్కువగా విజయం సాధిస్తారు. ఇవి ఇతరులపై అత్యధిక ప్రభావం చూపించే రంగాలు. ఎల్లప్పుడూ ఇతరులను ప్రభావితం చేయాలనే చూస్తుంటారు. కెరియర్, రోజువారీ దినచర్యలో ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారు.

Latest Videos

vuukle one pixel image
click me!