ముంబై నగరంలో అతి తక్కువ భూభాగంలో ఎక్కువ మంది ప్రజలు (People) నివసిస్తుంటారు. ముంబై జనసంద్రం అధికం గల నగరం. ముంబైలో అనేక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు (Tourist places) ఉన్నాయి. అందులో కొలాబా కాజ్ వే, వాగర్ కింగ్ డం, ఎస్సెల్ వరల్డ్, గేట్ వే ఆఫ్ ఇండియా, హాజీ అలీ మసీద్, జుహు బీచ్ ఇలా అనేక ప్రదేశాలు ముంబై నగరంలో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..
జుహు బీచ్: ప్రేమ జంటలు ఎక్కువగా ఇష్టపడేది జుహు బీచ్ (Juhu Beach). ప్రేమ జంటలు ఎక్కువ సమయం బీచ్ లో గడపడానికి ఇష్టపడతారు. ఇక్కడ కొద్దిసేపు సమయం గడిపిన కూడ ఎంతో ఆనందంగా ఉంటుంది. బంద్రా (Bandra) నుంచి అరగంట ప్రయాణం చేస్తే ఈ బీచ్ ను చేరుకోవచ్చు. ఈ బీచ్ లో దొరికే ఆహార పదార్థాలు ముంబైలోనే ప్రఖ్యాతి చెందిన పదార్థాలు. ఇక్కడ దొరికే గోలాస్ అనే ఐస్ క్రీమ్ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ బీచ్ (Beach) లో దొరికే ఆహార పదార్థాలు బేల్ పూరి, పానీ పూరి శాండ్విచ్. బీచ్ ఎక్కువ జనసంద్రంతో కిటకిటలాడుతుంటుంది.
హాజీ ఆలీ మసీదు : ముంబై సముద్ర తీరంలో హాజీ ఆలీ మసీదు (Haji Ali Masjid) ఉంది. కుల, మత భేదం లేకుండా అన్ని మతాల వారు ఈ మసీదును దర్శిస్తారు. శుక్రవారం (Friday) నాడు అధిక యాత్రికులతో ఇక్కడి మసీదు రద్దీగా ఉంటుంది. ముంబై వెళ్ళినప్పుడు మీకు చూడాలనిపిస్తే ఈ ప్రదేశాన్ని తప్పక చూడండి.
గేట్ వే ఆఫ్ ఇండియా: ఇది ఎనిమిది అంతస్తుల ఎత్తుతో ముంబైలోని (Mumbai) కోలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియా (Gateway of India) ప్రసిద్ధిగాంచిన శిల్పకళా అద్భుతం. దీనిని హిందు, ముస్లిం శిల్పశైలి లుగా కలిపి నిర్మాణం చేశారు. దీనికి దర్శించుకోవడానికి ప్రతియేటా ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.
కొలాబా కాజ్ వే: ముంబై భారతదేశంలోని (India) మొట్టమొదటి ఫ్యాషన్లకు పుట్టినిల్లు వంటిది. అయితే వీటి కొనుగోలు ముంబైలో మొట్టమొదటి ఎక్కడ మొదలవుతాయి అంటే కాజ్ వే (Cause Way) అని చెప్పవచ్చు. కాజ్ వే అనుభవాలు మనకు చాలా గుర్తుండి పోవాలంటే అక్కడ కాలినడకన తిరగడం మంచిది. ఇక ఇవే కాకుండా మరెన్నో ప్రదేశాలు కూడా ఉన్నాయి.