రాయలసీమలో తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

First Published Nov 11, 2021, 3:01 PM IST

రాయలసీమ (Rayalaseema) అనే పేరు వినగానే అందరి మనసులో కాస్త భయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు రాయలసీమ. కానీ ఈ ప్రాంతం అనేక పుణ్యక్షేత్రాలకు నిలయం. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా రాయలసీమలో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు గురించి తెలుసుకుందాం..
 

రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి (Tirupathi), శ్రీశైలం, మహానంది (Mahanandi), యాగంటి, అహోబిలం, లేపాక్షి, ఒంటిమిట్ట ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమ అనే ప్రాంతం ముఖ్యంగా నాలుగు జిల్లాల సమూహం. ఆ నాలుగు జిల్లాలు కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురము. ఈ ప్రాంతాలలో అనేక సినిమా షూటింగులు జరుపుకునే ఆధ్యాత్మిక కేంద్రాలు విద్యాసంస్థలు ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం.
 

శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో నల్లమల కొండలలో శ్రీశైలం ఒక చిన్న పట్టణం. శ్రీశైలం కృష్ణా నది (Krishna river) ఒడ్డున ఉంది. శ్రీశైలం ఒక పరమ పవిత్రమైన యాత్రా స్థలం. ఇక్కడ ఉన్న దేవాలయంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు.ఈ ఆలయంలో శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. మల్లికార్జున స్వామి శివునిగా, పార్వతి దేవి భ్రమరాంబగా పూజిస్తారు. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి ఏటా లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడగల మల్లెల జలపాతంలో స్నానం ఆచరించిన సకల పాపాలు (Sins) తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
 

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల దిగువ ప్రాంతంలో తిరుపతి (Tirupathi) ఉంది. తమిళంలో (Tamil) తిరు అంటే గౌరవప్రదమైన అని, పతి అంటే భర్త అని అర్థం. కాబట్టి తిరుపతి అంటే గౌరవప్రదమైన పతి అని అర్థం. తిరుపతిలోని కొండలు ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రాచీనమైన కొండలుగా చెబుతుంటారు. ఇక్కడ చూడవలసిన ప్రసిద్ధి గుళ్ళు తిరుపతి, వరాహ స్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, గోవిందరాజ స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేవాలయాలు (Temples) ఉన్నాయి. తిరుపతి లో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారతదేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు వస్తుంటారు.
 

మహానంది: మహానంది (Mahanandi) కర్నూలు జిల్లాలోని నంద్యాల (Nandhyala) పట్టణ సమీపంలో ఉంది. ఇక్కడి గర్భగుడిలో ఉన్న శివలింగం కింద ఉన్న భూభాగం నుండి  సంవత్సరం పొడవునా స్వచ్ఛమైన ఔషధగుణాలు  ఉన్న నీరు ప్రవహిస్తుంది. మనం నీటిలోకి సూది వేస్తే స్పష్టంగా కనపడే అంత స్వచ్ఛంగా నీరు ఉంటుంది. ఐదున్నర అడుగుల లోతు ఉన్న క్రిందనున్న రూపాయి బిళ్ళ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయ ఆవరణంలో ఉన్న అన్ని బావులలోనూ ఇలాంటి నీరే కనిపిస్తుంది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు భావిస్తారు.
 

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి (Srikalahasthi) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణం. స్వర్ణముఖినదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశం (India) లోనే ప్రాచీనమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ రెండు దీపాలలో ఒక్క దీపం ఎల్లప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది. మరొకటి నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.

click me!