దేవాలయాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటో తెలుసా? ఆంధ్రాలో ఇంత తక్కువ ఉన్నాయా?

First Published | Oct 24, 2024, 4:19 PM IST

దేవాలయం అనగానే భగవంతుడు కొలువై ఉన్న ప్రదేశం అని భక్తులంతా నమ్ముతారు. మీరు కూడా తరచూ గుడికి వెళ్లి దేవుడికి మొక్కులు చెల్లిస్తుంటారు కదా.. అయితే అసలు భారత దేశంలో ఏ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు ఎక్కువ ఉన్నాయో మీకు తెలుసా? ఎక్కడ హిందూ దేవాలయ సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారో తెలుసుకొనేందుకు ఈ స్టోరీ పూర్తిగా చదవండి. 
 

హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకి పుట్టినిల్లు భారత దేశం. వివిధ మతాల ప్రజల కలిసి మెలిసి జీవించడంతో పాటు హిందువుల్లోనే ఉన్న వివిధ వర్ణాల వారు ఐకమత్యంతో జీవిస్తారు. ఎవరి ఆచారాలు, సంప్రదాయాలు వారు పాటిస్తూ పరమత సహనాన్ని పాటిస్తారు. అందుకే ఇండియా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశంగా పేరుపొందింది. ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో దేవుడికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. 
 

హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకి పుట్టినిల్లు భారత దేశం. వివిధ మతాల ప్రజల కలిసి మెలిసి జీవించడంతో పాటు హిందువుల్లోనే ఉన్న వివిధ వర్ణాల వారు ఐకమత్యంతో జీవిస్తారు. ఎవరి ఆచారాలు, సంప్రదాయాలు వారు పాటిస్తూ పరమత సహనాన్ని పాటిస్తారు. అందుకే ఇండియా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశంగా పేరుపొందింది. ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో దేవుడికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. 
 

కేరళ రాష్ట్రంలో శబరిమల అయ్యప్ప స్వామి, తమిళనాడులో చిదంబరం నటరాజస్వామి, మధురై మీనాక్షి సుందరేశ్వరన్ కోవెల, కంచి ఏకాంబరేశ్వర ఆలయం, పళని సుబ్రహ్మణ్య స్వామి, ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి వేంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లిఖార్జున స్వామి, విజయవాడ కనకదుర్గ, ఒరిస్సా పూరి జగన్నాథస్వామి, కర్ణాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం రంగనాథ స్వామి, శృంగేరి శారదా పీఠం, గోకర్ణం మహాబలేశ్వర్ ఆలయం, మహారాష్ట్రలో ముంబా దేవి ఆలయం, అష్ట వినాయక క్షేత్రాలు, కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి గుడి, షిరిడీ సాయినాథ్ గుడి, త్రయంబకేశ్వరం, భీమశంకర జ్యోతిర్లింగం.. ఇలా ఒక్కో రాష్ట్రంలో అనేక ప్రత్యేక టెంపుల్స్ ఉన్నాయి. 
 


ఒక్కో రాష్ట్రంలో వేల సంఖ్యలో దేవాలయాలున్నాయి. వాటిలో ఏ రాష్ట్రంలో ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయో ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేవాలయాలు ఎక్కువగా ఉన్న టాప్ 7 రాష్ట్రాలు ఇవే.. అందులో రాజస్థాన్ ఏడవ స్థానంలో ఉంది. ఇక్కడ వివిధ దేవుళ్లకు చెందిన ఆలయాలు సుమారు 39,000 వరకు ఉన్నాయి. వీటిల్లో ప్రముఖమైనవి పుష్కర్‌లోని బ్రహ్మ దేవాలయం, ఉదయపూర్‌లోని ఎక్లింగ్‌జీ ఆలయం, జగత్‌లోని అంబికా మాత ఆలయం, దేశ్‌నోక్‌లోని కర్ణి మాత మందిర్, సలాసర్‌లోని సలాసర్ బాలాజీ ఆలయం, కరౌలిలోని మెహందీపూర్ బాలాజీ ఆలయం, రాణి వద్ద సాయి ధామ్, జైపూర్‌లోని బిర్లా మందిర్, మోతీ దుంగారి ఆలయం, ఖనియా-బాలాజీలోని గల్తాజీ ఆలయం.
 

దేశంలోనే దేవాలయాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో సుమారు 47,000 దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో ప్రముఖ క్షేత్రాలు.. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం, కాళహస్తి, విజయవాడ కనకదుర్గ దేవాలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం, నెల్లూరు రంగనాయకులస్వామి దేవాలయం మొదలైనవి ఉన్నాయి. 

అత్యధికంగా దేవాలయాలు ఉన్న అయిదవ రాష్ట్రం గుజరాత్. ఇక్కడ సుమారుగా 50,000 టెంపుల్స్ ఉన్నాయట. వీటిల్లో ప్రముఖమైనవి ద్వారకాధీశ దేవాలయం, శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం, నాగేశ్వర జ్యోతిర్లింగం, పావగఢ్ కొండ, అంబాజీ దేవాలయం, అక్షరధామ్ ఆలయం, కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం, రుక్మిణీ దేవి, ద్వారక, రాంచోదరాయ్ ఆలయం డాకోర్, ఖేడా, శ్రీ స్వామినారాయణ మందిర్ కలుపూర్, అహ్మదాబాద్ మొదలైనవి ఉన్నాయి. 

నాలుగో స్థానంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది. ఇక్కడ మొత్తం 53,500 దేవాలయాలు ఉన్నాయి. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం    కోల్‌కతా, కాళీఘాట్ కాళీ దేవాలయం    కోల్‌కతా, బేలూర్ మఠం    హౌరా, ఇస్కాన్ దేవాలయం    మాయాపూర్, నందికేశ్వరి ఆలయం సైంథియా, మదన్మోహన్ దేవాలయం    బిష్ణుపూర్, శ్రీ శ్రీ మాతృ మందిరం    జయరాంబటి, తారకనాథ్ ఆలయం    తారకేశ్వర్, డార్జిలింగ్ శాంతి పగోడా డార్జిలింగ్, బిర్లా దేవాలయం    కోల్‌కతా, పరస్నాథ్ మందిరం కోల్‌కతా, మహాకాల్ దేవాలయం    డార్జిలింగ్ ఇలాంటి మరిన్ని ప్రముఖ దేవాలయాలున్నాయి. 

మూడో స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో సుమారుగా 61,000 టెంపుల్స్ ఉన్నాయి. వీటిల్లో ఫేమస్ దేవాలయాలు ఏంటంటే.. కొల్లూరు, కుక్కే, ధర్మస్థల, శృంగేరి, హొరనాడు, కర్కల, మురుడేశ్వర, గోకర్ణ వంటి కొన్ని ఇతర ప్రసిద్ధ దేవాలయాలు ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉంటాయి. 

మహారాష్ట్ర అత్యధిక దేవాలయాలు ఉన్న జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 77,000 దేవాలయాలున్నాయి. వీటిల్లో ముంబా దేవి ఆలయం, అష్ట వినాయక క్షేత్రాలు, కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి గుడి, షిరిడీ సాయినాథ్ గుడి, త్రయంబకేశ్వరం, భీమశంకర జ్యోతిర్లింగం, మోరేశ్వర్ గుడి, శని సింగణాపుర్ టెంపుల్.,గిరిజా మాత మందిర్, కైలాష్ టెంపుల్, నాగేశ్వర జ్యోతిర్లింగం, భులేశ్వర గుడి, అమృతేశవర గుడి, శ్రీ మయురేషవర మురుగన్ గుడి మొదలైనవి ఉన్నాయి.
 

ఇక దేశంలోనే ఎక్కువ దేవాలయాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ ఏకంగా 79,000 ఆలయాలు ఉన్నాయని ఓ సర్వే ద్వారా తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం హిందూ, సనాతన ధర్మాలకు నిలయంగా ఉండేది. వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయాలు కూడా ఇక్కడ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు ఏంటంటే.. మీనాక్షి అమ్మన్ కోవెల మదురై, ఆది కుంబేశ్వరర్ కుంభకోణం, బృహదీశ్వరాలయం తంజావూరు, శ్రీ రంగనాథస్వామి దేవాలయం శ్రీరంగం, శ్రీ రాజగోపాల స్వామి దేవాలయం మన్నార్గుడి, జంబుకేశ్వర ఆలయం, తిరువానైకావల్, కంచి కైలాసనాథర్ ఆలయం కాంచీపురం, ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం, రామనాథస్వామి దేవాలయం రామేశ్వరం, మయూరనాథస్వామి ఆలయం మైలాడుతురై, కపాలీశ్వర ఆలయం చెన్నై, ఏకశిలా రాతి దేవాలయాలు మహాబలిపురం, పాపనాశం దేవాలయం తిరునెల్వేలి. ఇలాంటి దేవాలయాలకు తమిళనాడు చాలా ఫేమస్. అందువల్ల మీరు కూడా అవకాశం కుదిరినప్పుడు మీ దగ్గర్లోని దేవాలయాలను దర్శించి సంతోషంగా గడపండి. 
 

Latest Videos

click me!