కార్తీక మాసంలో అస్సలు చేయకూడని పనులు ఇవే..!

First Published Oct 17, 2024, 11:24 AM IST


మనస్ఫూర్తిగా ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే.. వారు కోరుకున్నవన్నీ లభిస్తాయని నమ్ముతారు.

Karthika Masam 2024

దీపావళి పండగ తర్వాత కార్తీక మాసం వచ్చేస్తున్న విషయం తెలిసిందే. అంటే మరో పది రోజుల్లో కార్తీక మాసం మొదలుకానుంది. ఈ కార్తీక మాసంలో.. శివుడికి భక్తిగా పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాదు.. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానాలు ఆచరిస్తారు. పేదలకు దానం చేస్తారు. ముఖ్యంగా తులసిమాతకు కూడా పూజలు చేస్తారు. మనస్ఫూర్తిగా ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే.. వారు కోరుకున్నవన్నీ లభిస్తాయని నమ్ముతారు. మరణం తర్వాత కూడా మోక్షం లభిస్తుందట. అందుకే ఈ నెలను ఆనందం, శ్రేయస్సు, అదృష్టానికి కారకంగా పరిగణిస్తారు.

ఇక.. ఈ కార్తీక మాసంలో భగవద్గీతను పఠించడం వల్ల కూడా శుభప్రదంగా భావిస్తారు. మరి… ఈ నెలలో పొరపాటున కూడా చేయకూడాని కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా దానం చేసే విషయంలో పొరపాట్లు చేయకూడదట. మరి, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…

Latest Videos


cooking oil

కార్తీక మాసంలో నూనె దానం..

కార్తీకమాసంలో నూనె దానం చేయరాదు. నూనె దానం చేయడం వల్ల ధన నష్టం కలుగుతుందని అంటారు . అలాగే కార్తీక మాసంలో ఆవనూనెను దానం చేస్తే ఆ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కార్తీకమాసంలో పొరపాటున కూడా నూనె దానం చేయకూడదు.

Turmeric Water

కార్తీక మాసంలో పసుపు దానం….

కార్తీక మాసంలో పసుపును దానం చేయడం కూడా మానుకోవాలి. ఈ మాసంలో పసుపును దానం చేయడం వల్ల వ్యక్తి జాతకంలో గురుదోషం కలుగుతుందని చెబుతారు. అలాగే, వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు. అందుకే పొరపాటున కూడా ఈ మాసంలో పసుపును దానం చేయకండి. అంతే కాకుండా పసుపును దానం చేయడం వల్ల శుభాలు కూడా తగ్గుతాయి. అందువల్ల, పసుపును దానం చేయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది.

కార్తీక మాసంలో ఇనుము దానం…

కార్తీకమాసంలో ఇనుము దానం చేయరాదు. ఇనుము దానం చేయడం వల్ల శని దోషం కలుగుతుందని అంటారు. కార్తీక మాసం శ్రీవిష్ణువుకు సంబంధించినది అని చెప్పుకుందాం. అందువల్ల, ఈ మాసంలో ఇనుము దానం చేయడం వల్ల, ఒక వ్యక్తి అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనితో పాటు, ఆనందం, శ్రేయస్సు కూడా తగ్గడం ప్రారంభమవుతుంది.

click me!