ఈ ఆలయాల్లో.. మద్యమే ప్రసాదం...!

First Published | Aug 25, 2022, 10:56 AM IST

చాలా మంది దేవతలకు ఏదో ఒక రకమైన ప్రసాదాన్ని అందజేస్తారు. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వీరు ఈ ప్రసాదం సమర్పిస్తారు. కాగా.. మన దేశంలో మద్యాన్ని దేవుడికి ప్రసాదంగా పంపిణీ చేసే ఆలయాలేంటో ఓసారి చూద్దాం...

మీరు గమనించి ఉంటారో లేదో కానీ.. పాఠశాలలు, కాలేజీలు, ఆలయాలు ఉన్న పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను పెట్టడానికి కూడా అనుమతించరు. ఎందుకంటే.. అవి చాలా పవిత్రమైన స్థలాలుగా భావిస్తారు. అందుకే.. వాటి సమీపంలో కనీసం మద్యం దుకాణాలు కూడా లేకుండా చూసుకుంటారు. అలాంటిది.. దేవాలయాల్లో మద్యాన్ని ప్రసాదంగా పంపిణీ చేయడం ఎక్కడైనా విన్నారా..? నమ్మకస్యంగా లేకపోయినా ఇదే నిజం. అది కూడా మన దేశంలోనే కావడం గమనార్హం.

liquor

భారతదేశం విభిన్న మత విశ్వాసాలు కలిగిన దేశం. ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 74.82 శాతం మంది హిందువులు నివసిస్తున్నారు. ఈ శాతంలో, 60-65 శాతం మంది భారతీయులు ప్రతిరోజూ దేవుడిని పూజిస్తారు. ఆలయానికి వెళతారు. చాలా మంది దేవతలకు ఏదో ఒక రకమైన ప్రసాదాన్ని అందజేస్తారు. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వీరు ఈ ప్రసాదం సమర్పిస్తారు. కాగా.. మన దేశంలో మద్యాన్ని దేవుడికి ప్రసాదంగా పంపిణీ చేసే ఆలయాలేంటో ఓసారి చూద్దాం...


1.కాల భైరవ దేవాలయం, ఉజ్జయిని - మధ్యప్రదేశ్

ఈ ఆలయాన్ని శివునికి అంకితం చేశారు.  ఇది 6000 సంవత్సరాల పురాతన ఆలయం, ఇక్కడ కాల భైరవుడిని పూజిస్తారు. స్పష్టంగా, ఈ ఆలయానికి వచ్చే ప్రజలు దేవుడికి మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. మదిర (మద్యం), మాన్స్ (మాంసం), మీన్ (చేప), ముద్ర (ధాన్యం) ,మైథున్ (లైంగిక సంభోగం) వంటి పంచమక్ర అనే తాంత్రిక సమర్పణలను ఈ దేవుడు అంగీకరిస్తాడట. కాలభైరవుని విగ్రహం భక్తులు సమర్పించిన ఆల్కహాల్ మొత్తాన్ని గ్రహిస్తుందని నమ్మకం. అనంతరం స్వామివారికి సమర్పించిన మద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. 
 

kali mata 001

2.కాళీ మాత ఆలయం - ఢిల్లీ

కాళీ దేవి దుర్గా దేవి  అత్యంత భయంకరమైన స్వరూపం. ఏదైనా సమస్యల నుండి బయటపడటానికి చాలా మంది ప్రజలు ఆమెను పూజించే కారణాలలో ఇది ఒకటి. కాళీదేవికి ఇచ్చే నైవేద్యం ఒక్కో ప్రదేశానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఢిల్లీలో, బంగల్ సాహిబ్ గురుద్వారా సమీపంలో కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ప్రసిద్ధ కాళీ మాత ఆలయాన్ని చాలా మంది సందర్శిస్తారు. విస్కీ నుండి వైన్ , 'దేశీ షరాబ్' వరకు అన్ని రకాల మద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. అయితే.. ఈ ప్రసాదాన్ని భక్తులకు మాత్రం పంచిపెట్టరు.
 

3.తారాపీత్, బీర్భం - పశ్చిమ బెంగాల్

ఇది పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ శక్తిపీఠం, ఇక్కడ దేవతకు మాంసం, చేపలతో పాటు ప్రసాదం అందించే సమయంలో 'కరణ్ సుధ' లేదా మద్యాన్ని అందిస్తారు.  ఎందుకంటే తంత్ర సాధనలో మద్యం ఒక ముఖ్యమైన భాగం.

4.పాటియాలా కాళీ దేవాలయం, పాటియాలా - పంజాబ్

1936లో పాటియాలా మహారాజా భూపిందర్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారు, అనేక మంది పూజించే కాళీ మాత ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం ఉంది. ఈ ఆలయం ఎంతగానో ప్రసిద్ది చెందింది, ఉత్తర భారతదేశం అంతటా ప్రజలు దేవతను ప్రార్థించడానికి, తమ కోరికలు నెరవేర్చుకవడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.  ఒక వ్యక్తి కోరిక నెరవేరినప్పుడు, వారు మేక, కోళ్ళు , కొబ్బరికాయలతో పాటు  కాళీ మాతకు ప్రసాదంగా మద్యాన్ని అందిస్తారు.
 

5.ఖబీస్ బాబా ఆలయం, సీతాపూర్ - లక్నో

ఈ ఆలయం ఖబీస్ బాబాకు అంకితం చేశారు, అతను ఆధ్యాత్మిక వైద్యుడు. గాయపడిన వ్యక్తులకు తన స్పర్శతో చికిత్స చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అతను విస్కీ తాగడానికి ఇష్టపడతాడు, అందువలన అతని భక్తులు చాలా మంది అతని స్మారక ఆలయానికి మద్యం అందిస్తారు. ఇక్కడ కూడా బాబాకు నైవేద్యంగా పెట్టిన మద్యాన్ని భక్తులకు పంచుతారు.

Latest Videos

click me!