శ్రీరామనవమి 2023: ఈ రాశుల వారిని అదృష్టం వరిస్తుంది..!

First Published | Mar 27, 2023, 3:15 PM IST

Sri Ram Navami 2023: చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరామ నవమిని జరుపుకుంటాం. ఈ ఏడాది ఈ పండుగ మార్చి 30 న వచ్చింది. శ్రీరాముడు జన్మదినం అయిన శ్రీరామనవమి కొన్ని రాశుల వారికి  అదృష్టాన్ని కలిగిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

Sri Ram Navami 2023: దేశవ్యాప్తంగా మార్చి 30 న శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.  ప్రతి ఏడాది కార్తీక మాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున ఈ పండుగను జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం.. శ్రీరాముడు చైత్ర శుక్ల పక్షం తొమ్మిదో రోజున జన్మించాడు. ఈ పవిత్రమైన రోజున  దేవాలయాల్లో శ్రీరాముడిని పూజిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 
 

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగ రోజున నాలుగు పవిత్రమైన యోగాలు ఏర్పడనున్నాయి. అందుకే ఈ రోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది. గురు పుష్య యోగం, అమృత్ సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం ఈ ప్రత్యేకమైన రోజున ఏర్పడనున్నాయి. ఇది కొన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అది ఏయే రాశులపై అంటే..
 

Latest Videos


రామ నవమి శుభ యోగం

రవి యోగం - రోజంతా ఉంటుంది

సర్వార్థ సిద్ధి యోగం - రోజంతా ఉంటుంది

గురు పుష్య యోగం - మార్చి 09 రాత్రి 29:31 నుంచి 06:17 వరకు

అమృత్ సిద్ధి యోగం - మార్చి 09 రాత్రి 29:31 నుంచి ఉదయం 06:17 వరకు

వృషభ రాశి 

వృషభ రాశి వారు ఈ నాలుగు శుభ యోగాల సృష్టి వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. ఈ కాలంలో మీరు కొత్త పనిని ప్రారంభించినట్టైతే  మంచి లాభాలను పొందుతారు. ఈ సమయం పెట్టుబడికి శుభదాయకంగా ఉంటుంది. అంతేకాదు ఎన్నో ఏండ్ల నుంచి నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.

సింహ రాశి 

సింహ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ కాలంలో అన్ని ప్రధాన రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే మీరు పాత రుణం నుంచి బయటపడతారు. నూతన ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

తులా రాశి

తులా రాశి జాతకులకు కూడా ఈ సమయం శుభప్రదంగా ఉండబోతోంది. ఈ శ్రీరామనవమికి ఈ రాశు వారు వివాహానికి సంబంధించిన ప్రతిపాదనలను అందుకుంటారు. అలాగే ఈ రోజున కొన్ని శుభవార్తలను కూడా వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. 

click me!