ఇంట్లో పెద్దవాళ్లు చెప్పడం మీరు వినే ఉంటారు. ఏరోజు పడితే ఆరోజు తలస్నానం చేయకూడదని, కేవలం ఈరోజు మాత్రమే చేయాలి..? ఆ రోజు మాత్రమే చేయాలి అని చెబుతూ ఉంటారు. అంతెందుకు.. కొన్ని రోజుల్లో గోళ్లు కత్తిరింకూడదు అని, జుట్టు కత్తిరించకూడదు అని కూడా చెబుతూ ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ విషయాలను కచ్చితంగా ఫాలో అవ్వాలని చాలా వరకు నమ్ముతూ ఉంటాం.
వీటిలో భాగంగా.. పెళ్లికాని అమ్మాయిలు మంగళవారం తలస్నానం చేయకూడదని చెబుతుంటారు. దీని వెనక ఉన్న కారణం ఏంటి..? నిజంగానే మంగళవారం తలస్నానం చేస్తే సమస్యలు వస్తాయా..? ఇప్పుడు తెలుసుకుందాం..
మత గ్రంధాల ప్రకారం, పెళ్లికాని అమ్మాయిలు అలాగే వివాహిత మహిళలు మంగళవారం నాడు తల స్నానం చేయకూడదు. అవివాహిత స్త్రీలు మంగళవారం తల స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుందని నమ్ముతారు. అలాగే, మంగళవారం రోజున పెళ్లి కాని అమ్మాయిలు తమ జుట్టును కడగడం వల్ల వారి సోదరుడిపై అశుభ ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాంటి పొరపాట్లకు దూరంగా ఉండాలి.
Hair wash
అంగారకుడి స్థానం బలహీనంగా మారవచ్చు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పెళ్లికాని అమ్మాయిలు మంగళవారం జుట్టును కడగకూడదు. దీని కారణంగా, కుజుడు స్థానం బలహీనంగా మారవచ్చు. ఇది ఆ యువతి వివాహాన్ని ప్రభావితం చేస్తుంది. వివాహంలో జాప్యం అ్వడం, లదేంటే శుభ ఫలితాలు లభించవు. అందువల్ల, పెళ్లికాని అమ్మాయిలు మంగళవారం హెయిర్ వాష్ చేయకపోవడమే మంచిది.
అంతేకాదు.. అలా చేయడం వల్ల ఆ అమ్మాయిలు ఎంత కష్టపడి పనిచేసినా వారికి విజయం లభించడం కష్టంగా అనిపించొచ్చు. అంతేకాకుండా.. ఇది వారి ఇంటి ఆర్థిక పరిస్థితిపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. మానసిక సమస్యలు కలగడానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి... ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండటమే మంచిది.