ఈ క్రోధి నామసంవత్సరం అంత భయంకరంగా ఉండబోతోందా?

First Published | Apr 6, 2024, 2:48 PM IST

ఉగాది మనకు కొత్త సంవత్సరం. ఈ పండుగతో వరుసగా పండుగలు వస్తూ, పోతూ ఉంటాయి. అయితే ఈ క్రోధినామసంవత్సరం అంత బాగా ఉండకపోవచ్చని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే? 
 

Image: Freepik

ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 9 న వచ్చింది. ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఉగాదిని యుగాది అని కూడా ఉంటారు. దీనికి అర్థం సంవత్సరంలో మొదటి రోజు. అందుకే దీన్ని కొత్త సంవత్సరం అంటారు. ఈ పండుగను తెలుగురాష్ట్రాల్లో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. 

Image: Freepik

ఉగాది పండుగ పర్వదినాన దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ప్రతి గుడిలో సాయంత్రం వేళ పంచాంగం శ్రవణం ఉంటుంది. ఈ రోజు గుడిలో పండితులు పంచాంగం ద్వారా.. ఈ ఏడాది ఏ రాశివారికి ఎలా ఉండబోతోంది? పంటలు ఎలా పండుతాయి? వర్షాకాలం ఎలా ఉండనుంది? వంటి ఎన్నో విషయాలను తెలియజేస్తారు. చాలా మంది పండితులతో ఈ ఏడాది తమ పూర్తి జాతకాన్ని కూడా చెప్పించుకుంటుంటారు. 


Image: Getty Images

ఉగాది పండుగ రోజూ ప్రతి ఇంట్లో ఉగాది పచ్చడి, బొబ్బట్లు ఖచ్చితంగా ఉంటాయి. చింతపండు, మామిడి, బెల్లం, మిరియాలు, కారం, ఉప్పు, వేపపువ్వుతో తయారుచేసే ఉగాది పచ్చడిని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే ఈ ఉగాది పచ్చడికి చాలా ప్రత్యేకత ఉంది. 
 

Image: Freepik


ఏప్రిల్ 9 నాడు మనం క్రోధి నామసంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ క్రోధినామసంవత్సరానికి పండితులు కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతగా బాగా ఉండదని పండితులు చెబుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 1904-05 లో వచ్చింది. అలాగే 1964-05 లో కూడా ఇదే వచ్చింది. ఈ సంవత్సరం జనాలకు కలిసి రాలేదట. అలాగే ఆ ఏడాదంతా జనాలు బాగా భయపడ్డారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. 

Image: Freepik

క్రోధినామసంవత్సరం అంటే అర్థమేంటో తెలుసా? క్రోధి అంటే కోపం అని అర్థం. ఇక ఈ క్రోధినామసంవత్సరం బాగా కోపంగా ఉండబోతుందని అర్థం వస్తుంది. ఈ సంవత్సరంలో అనవసరంగా గొడవలు, కొట్లాటలు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. కోపాన్ని చెడ్డదానిలా చూడలేం. కాబట్టి ఈ ఏడాది మరీ దారుణంగా ఏం ఉండదని పండితులు అంటున్నారు. ఏదేమైనా మన కర్మ, మనం చేసే పనులే మనం ఎలా ఉండాలో నిర్దేశిస్తాయని అంటున్నారు. మంచి పనులు చేసేవారికి ఈ ఏడాది అంతా మంచే జరుగుతుంది. చెడు పనులు చేసేవారికి చెడే జరుగుతుందని అంటున్నారు.  
 

Latest Videos

click me!