తులసి మొక్క వద్ద రోజూ దీపారాధన చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 6, 2024, 11:54 AM IST

ప్రతిరోజూ తులసి మొక్క ముందు దీపారదన చేయడం అంటే...తులసి మాతపై మనకు ఉన్న  భక్తి, మర్యాద ను తెలియజేస్తాయి.


దాదాపు అందరు ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది.  చాలా మంది తులసి మొక్కకి రోజూ పూజ చేస్తూ ఉంటారు. కొందరు.. అప్పుడప్పుడు, ముఖ్యంగా పండగ సమయంలో పూజ చేస్తూ ఉంటారు. అయితే... తులసి మొక్క ముందు రోజూ దీపారాధన చేసేవారు కూడా ఉంటారు. కానీ.. అలా ప్రతిరోజూ దీపారాధాన చేయడం వల్ల  కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

ప్రతిరోజూ తులసి మొక్క ముందు దీపారదన చేయడం అంటే...తులసి మాతపై మనకు ఉన్న  భక్తి, మర్యాద ను తెలియజేస్తాయి.


తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వల్ల.... నూనె లేదంటే.. నెయ్యితో దీపం వెలిగించడం వల్ల.. ఆ వాసనకు ఆ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా మారుతుంది. దాని వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది.

tulsi plant

తులసి మొక్క వద్ద దీపం  వెలిగించడం వల్ల... ఆ దీపం వెలుగుతూ.. ఇంట్లో ప్రశాంతతను, స్వచ్ఛతను అందిస్తుంది. అంతేకాదు.. దీపం వెలిగించినప్పుడు.. ఆ వేడి తులసి ఆకులకు తగులుతుందట. ఆ వేడికి... తులసి ఆకుల నుంచి.. మంచి ఆయుర్వేదిక సుగుణాలు బయటకు వస్తాయి. అలా వాటిని పీల్చడం వల్ల కూడా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం అందిస్తుంది.


ప్రతిరోజూ క్రమం తప్పకుండా.. రోజూ దీపారాధాన చేయడం వల్ల  టెన్షన్, యాంక్సైటీ లాంటివి తగ్గిపోతాయి. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు.. రోజూ దీపారాధన చేయడం వల్ల  ఆ ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది.

ఇది మాత్రమే కాదు... దీపారాధన చేయడం వల్ల మనకు ప్రకృతితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇంట్లో ప్రశాంతంత వాతావరణం ఏర్పడుతుంది. ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది.
 

Latest Videos

click me!