Story of Souls
హిందూ మతంలో చాలా రకాల గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో మనకు చాలా విషయాల గురించి ప్రస్తావించారు. వాటిల్లో మరణం కూడా ఒకటి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ చావు తప్పదు. కానీ.. ఆ మరణం ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. ఎవరూ ఊహించలేరు కూడా. కానీ.. మనిషి మరణం దగ్గరపడినప్పుడు కొన్ని క్షణాల ముందు కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తుందట. ఈ విషయాన్ని శివ మహా పురాణంలో ప్రస్తావించారు.
మరణం ఎప్పుడు, ఎలా వస్తుందనే విషయం మనకు తెలియకపోయినా.. దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. చాలా ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. వాటి గురించి శివమహా పురాణం స్పష్టంగా పేర్కొన్నారు.
శివమహా పురాణం ప్రకారం.. ఒక మనిషికి మృత్యువు చేరువైనప్పుడు.. వాళ్లకు వారి నీడ కనపడదట. ఎందుకంటే... మరణిస్తున్న వ్యక్తికి తన నీడను చూసే శక్తి కూడా ఉండదట. అంతేకాదు... శివ మహాపురాణం ప్రకారం... మరణానికి దగ్గరైనప్పుడు ఒక వ్యక్తి శరీరం నీలం రంగులోకి మారుతుందట. అంతేకాదు.. అతని శరీరంపై ఎర్రటి మచ్చలు రావడం మొదలౌతుందట.
శివ మహాపురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణం వైపు అడుగులు వేస్తే అతని శరీరంలోని కొన్ని భాగాలు నిర్జీవంగా మారిపోతాయట. మనిషి శరీంలోని కొన్ని శరీర భాగాలు రాయిలా మారి బరువెక్కుతాయట. వీటిలో కళ్ళు, నోరు, నాలుక, చెవులు , ముక్కు కూడా ఉంటాయి.
ఒక వ్యక్తి మరణ సమయం ప్రారంభమైనప్పుడు అతని నాభి చిన్నదిగా మారుతుంది. నాభి శరీరానికి కేంద్రంగా పరిగణిస్తారట.. జననం, మరణం నాభితో అనుసంధానించి ఉంటాయట. మరణానికి ముందు, వ్యక్తి దృష్టికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటాడు. అతను నక్షత్రాలు , సూర్యుని చూడటం మానేస్తాడు. అంతేకాదు ఇంద్ర ధనస్సు రాత్రిపూట కనిపిస్తుందని చెబుతారు. ఈ లక్షణాలలో ఏవైనా కనిపించడం ప్రారంభిస్తే, వ్యక్తి మరణానికి దగ్గరగా ఉంటాడని అర్థమట.