జాతకంలో శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నవారు ఈ పనులు ఎలాగూ చేస్తారు. శుక్రగ్రహం అనుకూలంగాలేనివారు ఈ పనులు ఎక్కువగా చేయాలి. వీరికి వాటిపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. కాని ఆసక్తిని ఏర్పరచుకోవడం చాలా అవసరం. శుక్రుడు జాతకంలో అష్టమస్థానంలోగాని, షష్ఠ స్థానంలోగాని, వ్యయ స్థానంలోగాని ఉన్నవారు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు, ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా లేనివారు ఈ పనులు ఎక్కువగా చేయాలి. అలంకరణలు చేయడానికి ఓపిక చాలా అవసరం. ఈ పనులు చేయడానికి వీరికి అంతగా ఆసక్తి ఉండదు.
శుక్ర గ్రహానికి అధిదేవత కూడా లక్ష్మీదేవి. వరం అంటే మేలు చేయడం. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన దేవత లక్ష్మీదేవి కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శుక్రుడు ప్రేమకు కారకుడు, వివాహాలకు కారకుడు. శరీరంలో ఒక రకమైన ఆకర్షణ ఇచ్చే గ్రహం శుక్రుడు. జాతకంలో శుక్రగ్రహం లోపంగా ఉంటే ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. ఆ ఆకర్షణను పెంచుకోవడానికి ఈ పూజ చాలా అవసరం. సరియైన సమయంలో వివాహం కావడానికి కూడా శుక్రుడే కారకుడు.
అన్ని రకాల ఆనందాలు, అష్టైశ్వరాలను పొందాలంటే లక్ష్మీపూజ తప్పనిసరి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ పూజను అందరూ చేసుకోవడం మంచిది.