Raksha Bandhan 2023
రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధం పవిత్రతకు ప్రతీక. ఈ రోజున అక్కా చెల్లెల్లు తమ సోదరుడి మణికట్టుకు రక్ష సూత్రం లేదా రాఖీని కట్టి.. ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటారు. అలాగే సోదరులు తమ అక్కా చెల్లెల్లను కాపాడతామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు రాఖీ కట్టినందుకు సోదరులు తమ అక్కా చెల్లెల్లకు బహుమతులను కూడా ఇస్తుంటారు. ఈ ఏడాది రాఖీ పండుగ రోజున భద్రకాలం ఏర్పడుతుంది. అందుకే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను ఈసారి రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు. రాఖీ కట్టేటప్పుడు అక్కా చెల్లెల్లు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Raksha Bandhan 2023
వినాయకుడికి రాఖీ
రాఖీ పండుగ రోజున సోదరుడికి రాఖీ కట్టడానికి ముందు వినాయకుడికి రాఖీ కట్టాలి. ఆ తర్వాతే మీ అన్నకు లేదా తమ్ముడికి రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల అన్నదమ్ముల బంధంలో సమస్యలు తొలగిపోయి, వారి మధ్య ప్రేమ పెరుగుతుంది.
Raksha Bandhan 2023
లక్ష్మీ దేవి పూజ
మీరు కెరీర్ లో సమస్యలు ఎదుర్కొంటుంటే రాఖీ పండుగ రోజున ఈ పనులు చేయొచ్చు. రక్షాబంధన్ రోజున లక్ష్మీదేవిని పూజలతో పూజించండి. అలాగే బాలికలకు ఖీర్ పంచిపెట్టాలి. ఖీర్ ఈ పరిహారాలు వృత్తిలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాయి. అలాగే డబ్బును పొందుతాయి.
Image: Getty Images
డబ్బు సంపాదించే మార్గాలు
రక్షాబంధన్ రోజున అక్కాచెల్లెళ్లు అక్షింతలు, తమలపాకు, వెండి నాణేలను గులాబీ రంగు వస్త్రంలో వేసి సోదరుడికి ఇవ్వాలి. అలాగే మీ సోదరుడు మీరు కట్టిన రాఖీని భద్రంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి.. ఆదాయం పెరుగుతుంది.
Image: Getty Images
ఖచ్చితంగా ఈ పని చేయండి
ఇంట్లో సుఖసంతోషాలు నెలకొనాలంటే పేదలకు అన్నదానం చేయాలి. దీనితో పాటు ఆవుకు పచ్చిగడ్డి తినిపించొచ్చు. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, ప్రశాంతత, ఆహ్లాదం కలుగుతాయి.