న్యూ ఇయర్ రోజు శుభ సమయంలో శివుడికి ఇలా అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ మాయం

First Published | Dec 27, 2023, 9:38 AM IST

New Year 2024: జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. కొత్త సంవత్సరం మొదటి రోజు పవిత్రమైన ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం జనవరి 02 తెల్లవారుజాము 04.36 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడిని ఆరాధించడం వల్ల అశేష ఫలితాలు కలుగుతాయి. 
 

New Year 2024: సనాతన ధర్మంలో పుష్య మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంగ్లిష్ క్యాలెండర్ ఈ నెల నుంచే మొదలవుతుంది. 2024 సంవత్సరం మొదటి రోజు సోమవారం వస్తుంది. ఈ రోజు దేవతల దేవుడైన పరమేశ్వురుడికి అంకితం చేయబడింది. ఈ రోజు శివుడితో పాటుగా పార్వతీదేవిని కూడా పూజిస్తారు. ఈ రోజు చాలా మంది భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. అలాగే సోమవారం  నాడు శివుడికి జలాభిషేకం చేసంతే కోరికలన్నీ నెరవేరుతాయని శివ పురాణం చెబుతోంది. 
 

అంతేకాదు ఈ రోజు శివుడికి అభిషేకం చేయడం వల్ల దుఃఖం, బాధలు కూడా తొలగిపోతాయనే నమ్మకం ఉంది. మీరు కూడా శివానుగ్రహం పొందాలనుకుంటే జనవరి 1న అంటే సోమవారం నాడు శుభ సమయంలో శివుడిని పూజించండి. మరి ఈ రోజు శుభ సమయం, శుభ యోగం ఎప్పుడో తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


కొత్త సంవత్సరం మొదటి రోజున,  పుష్య మాసంలోని కృష్ణ పక్షం ఐదో రోజు మధ్యాహ్నం 02.28 గంటలకు శుభ సమయం ఉంటుంది. ఆ తర్వాత షష్టి తిథి ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరం మొదటి రోజున మాఘ నక్షత్రం ఉదయం 08.36 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పూర్వా ఫాల్గుణి నక్షత్రం ఉంటుంది.
 


జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. కొత్త సంవత్సరం మొదటి రోజు పవిత్రమైన ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. జనవరి 02 తెల్లవారుజామున 04.36 గంటల వరకు ఈ యోగం ఉంటుంది. ఈ యోగంలో శివుని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే కొత్త సంవత్సరం మొదటి రోజు త్రిహిగి యోగం కూడా ఏర్పడనుంది. దీన్ని పవిత్రంగా భావిస్తారు. ఈ యోగంలో శుభకార్యాలు చేయొచ్చు.
 

కొత్త సంవత్సరం మొదటి రోజు అంటే సోమవారం మధ్యాహ్నం 02.28 గంటల వరకు పరమేశ్వరుడు నందిపై స్వారీ చేస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో శివుడిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకే కొత్త సంవత్సరం మొదటి రోజు మధ్యాహ్నం 02.28 గంటల వరకు భక్తులు రుద్రాభిషేకం చేయొచ్చు. ఈ సమయంలో రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేయడం వల్ల శుభకార్యాలు సాఫీగా సాగుతాయి. 

click me!