తులసి మొక్క అనేది దాదాపు ప్రతి హిందువు ఇంట్లోనూ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా భావించి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. నేటి తరం వారు తులసి మొక్క యొక్క పవిత్రత పూర్తిగా తెలియదు. సాధారణ మొక్కలాగే ఈ మొక్కని ఎండిపోయిన వెంటనే తీసేయటం, ఎప్పుడు పడితే అప్పుడు మొక్కని నాటడం వంటివి చేస్తూ ఉంటారు.
దీని వలన పుణ్యం సంగతి పక్కన పెడితే పాపం మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. అందుకే తులసి మొక్క గురించి పూర్తిగా తెలుసుకోండి. సాధారణంగా తులసి కోటలో తులసి మొక్క ఎండిపోతే వెంటనే తీసి పక్కన పడేసి వెంటనే కొత్త మొక్క నాటకండి.
ఎండిన మొక్కని తీయటానికి ముహూర్తం ఉండాలి.. కొత్త మొక్కని నాటటానికి కూడా ముహూర్తం ఉండాలి. కార్తీక మాసంలో తులసి మొక్కని నాటటానికి గురువారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. గురువారం రోజు శ్రీహరి కి ప్రీతిపాత్రమైన రోజు.
తులసి శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైనది. అందుకే గురువారం ఇంట్లో తులసి మొక్కని నాటితే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. మీ ఇంట్లో ఈశాన్యం, ఉత్తరం, తూర్పు దిశలలో తులసిని నాటవచ్చు. ఉత్తర దిశ అత్యంత పవిత్రమైనది.
తులసి మొక్కని సోమ, బుధ, ఆది వారాలలోనూ.. ఏకాదశి,సూర్య, చంద్ర గ్రహణాల రోజును అస్సలు నాటకూడదు. ఈ రోజులలో కనీసం తులసి మొక్కని ముట్టుకోను కూడా ముట్టుకోకూడదు. ఆదివారం తులసి మొక్కకి నీరు సమర్పించకూడదు. సూర్యస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు.
అలాగే ఎండిపోయిన తులసి మొక్కని ఎట్టి పరిస్థితుల్లోని ఇంట్లో ఉంచకండి. అది మీ జీవితంలో లేని సమస్యలను కలిగిస్తుంది. ఎండిపోయిన తులసి చెట్టుని ఇంటి ఆవరణలోనే పాతటం లేదంటే ప్రవహించే నీటిలో వేయటం చేయండి. అంతేగాని ఎట్టి పరిస్థితులలోని వాటికి మంట పెట్టకండి అది మహా పాపం.