Spiritual: పెళ్లి జరగడంలో జాప్యం జరుగుతుందా.. అయితే ఇలా ట్రై చేయండి?

Published : Aug 03, 2023, 11:22 AM IST

Spiritual : కొంతమందికి పెళ్లి వయసు దాటిపోతున్నా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని పెళ్లి సంబంధాలు మానవ ప్రమేయం వల్ల కుదరకపోతే.. కొన్ని మాత్రం గ్రహబలం బాగోక పోవడం వల్ల కుదరవు. అలాంటి వాళ్ళ కోసమే ఈ పరిహారాలు.  

PREV
16
Spiritual: పెళ్లి జరగడంలో జాప్యం జరుగుతుందా.. అయితే ఇలా ట్రై చేయండి?

సాధారణంగా వయసు దాటిపోయినా కూడా పెళ్లి జరగకపోతే ఆ వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ ఆ తల్లిదండ్రులు అనుభవిస్తారు. అయితే కొన్ని దైవ కార్యాలు చేయడం వలన పెళ్లి సంబంధాలు కుదురుతాయి అని చెప్తున్నారు అదేలాగో చూద్దాం.

26

ఎవరైతే తమ వివాహం ఆలస్యం అవుతుందని భావిస్తారో వారు వారి కుటుంబంలోని చిన్నారులతో శివాలయానికి వెళ్లి శివపార్వతులకి పూజించాలి. అలాగే పెళ్లి కుదరని వారు స్త్రీలు అయితే కనుక రాగి పాత్రలో నీటిని నిలిపి రాత్రి వేళలో మహావిష్ణువు ఫోటో ముందు ఉంచాలి.

36

గురువారం రోజు మహావిష్ణువుకి ప్రత్యేకంగా పూజించాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండాలి. అలాగే అరటి చెట్టును కూడా పూజించాలి. పసుపుని దానం చేసినట్లైనా కూడా మంచి ఫలితం లభిస్తుంది. అలాగే గురు మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
 

46

అలాగే వివాహం కాని వారు స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆరు ముఖాలు ఉండే రుద్రాక్షని ధరించాలి. ఈ రుద్రాక్ష కార్తికేయని రూపంగా పరిగణిస్తారు. రుద్రాక్షను ధరించడం వల్ల పెళ్లికి సంబంధించిన సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. అలాగే స్త్రీలు 16 సోమవారాలు ఉపవాసం ఉండటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి.
 

56

అదే విధంగా పౌర్ణమి రోజున మర్రిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణం చేయటం వల్ల మీ పెళ్లికి ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. అదే పెళ్లి కానీ మగవాళ్ళు అయితే ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించాలి. స్వామివారికి సింధూరం సమర్పించాలి.
 

66

ఇలా 21 మంగళవారాలు చేయటం వలన వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే పెళ్లి కావలసిన పిల్లలు తమ గది నైరుతి దిశలో లేకుండా చూసుకోవాలి. దక్షిణ దిశలో పాదాలను పెట్టి నిద్రపోవటం వలన కూడా పెళ్ళికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి.

Read more Photos on
click me!

Recommended Stories