navratri 2023: మీ కలలో దుర్గమాత ఇలా కనిపించిందా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

First Published | Oct 21, 2023, 10:34 AM IST

navratri 2023: నవరాత్రుల సందర్భంగా చాలా మందికి దుర్గమాత కలలోకి వస్తుంటుంది. దీన్ని శుభంగా పరిగణిస్తారు. అయితే దుర్గమాత మన కలలో కోపంగా ఉన్నట్టు కనిపించిందా? లేక సంతోషంగా ఉన్నట్టు కనిపించిందా? అనే దాన్ని బట్టే శుభంగా పరిగణించాలని జ్యోతిష్యులు అంటున్నారు. కలలో దుర్గమాత కోపంగా కనిపిస్తే అశుభంగా భావిస్తారు.
 

నవరాత్రుల్లో దుర్గమాతను నిష్టగా పూజిస్తారు. అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఉపవాసం ఉంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఈ రోజు అమ్మవారు కాళిరాత్రి రూపంలో దర్శనమిస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో అమ్మవారు మనతో సంతోషంగా ఉందా? లేదా? కోపంగా ఉందా? అని ఇలాంటి ఎన్నో విషయాలు భక్తుల మదిలో మెదులుతూనే ఉంటాయి.  మరి మన కలలో దుర్గమాత ఎలా కనిపిస్తే మంచిది కాదు? ఎలా కనిపిస్తే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
 

నవరాత్రుల్లో భక్తుల కలలో దుర్గమాత కోపంతో కూడిన రూపాన్ని పదేపదే చూస్తే.. దీన్ని అశుభ సంకేతంగా భావిస్తారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఇలాంటి కలలు పడ్డప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కల ద్వారా మీకు తెలియకుండానే మీరు చేసిన తప్పు మీకు సరికాదని తల్లి చెప్పాలనుకుంటుందట. మీరు తల్లి కోపాన్ని పోగొట్టాలంటే ముందుగా మీరు చేసిన తప్పులకు తల్లికి క్షమాపణలు చెప్పండి. ఆ తర్వాత వెంటనే చెడు పనులను ఆపేయండి. 
 

Latest Videos


మీ కలలో ఎర్రటి దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న భగవతి మాతను చూస్తే మీరు ఎంతో ఆనందించాలి. ఎందుకంటే ఈ కలను డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి కలగంటే మీరు త్వరలో మీ జీవితంలో సంతోషాలు వెళ్లివిరుస్తాయని అర్థం. అలాగే వృత్తి నుంచి వ్యక్తిగత జీవితంలో మీరెన్నో  ప్రయోజనాలను పొందుతారని ఈ కల సంకేతం ఇస్తుంది. 
 

జగదాంబ సింహంపై స్వారీ చేస్తున్న కలను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి కల వస్తే మీరెంగో సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ కల తల్లి పూర్తి అనుగ్రహం మీపై ఉందని చూపిస్తుంది.

click me!