అందుకే కాళీమాతను పూజిస్తారు
కాళరాత్రి మాతను పూజించడం వల్ల భక్తులు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా తంత్ర మంత్రం సాధకుల్లో కాళరాత్రి ఆరాధన ప్రాచుర్యం పొందింది. అందుకే అర్ధరాత్రి కాళరాత్రి అమ్మవారిని పూజించాలనే నియమం ఉంది. కాళీమాతను పూజించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుందని నమ్ముతారు. కాళరాత్రి మాత దుష్టులను నాశనం చేస్తుంది. అందుకే ఆమెను హిందూ మతంలో వీరత్వానికి, ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు. మరి ఈ రోజు అమ్మవారు కాళిగా ఎందుకు మారిందో కథను ఇప్పుడు తెలుసుకుందాం..