Navratri: శరన్నవరాత్రులలో ఐదవ రోజు.. స్కందమాత దుర్గాగా దర్శనమిచ్చిన అమ్మవారు

First Published Oct 11, 2021, 8:57 AM IST

ఈరోజు నవరాత్రులో 5వ రోజుగా అమ్మవారు స్కందమాత అవతారంలో దర్శనమిస్తారు. నవరాత్రులలో ఐదవరోజైన ఆశ్వీయుజ శుద్ధ పంచమినాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. 

ఈరోజు నవరాత్రులో 5వ రోజుగా అమ్మవారు స్కందమాత అవతారంలో దర్శనమిస్తారు.నవరాత్రులలో ఐదవరోజైన ఆశ్వీయుజ శుద్ధ పంచమినాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. ఇప్పుడు స్కందమాత అవతారం గురించి తెలుసుకుందాం.

కార్తికేయుని పేరు స్కంధ నుంచి అమ్మవారికి స్కందమాతగా పేరు వచ్చింది. స్కందుడు అంటే పార్వతీదేవి, ఈశ్వరునికి పుట్టిన కుమారుడు కుమార స్వామి. ఇక్కడి అమ్మవారికి చేసిన పూజలు కుమారస్వామికి చెందుతాయి.                   
 

స్కందమాత  నాలుగు చేతులతో సింహ వాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, ఘంటాను ధరిస్తుంది. ఒక చేయి అభయముద్రలో ఉంటుంది. ఆమె ఒడిలో కుమారస్వామి కూర్చుని ఉంటాడు.               

పూర్వం వజ్రాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని పుత్రుడు తారకాసురుడు. బ్రహ్మ వరప్రసాదుడై దేవతలను నానా ఇబ్బందులు పెట్టడంతో.. అది భరించలేక దేవతలంతా పరమేశ్వరున్ని ఆశ్రయిస్తారు.                       
 

అప్పుడు శివపార్వతుల శక్తి ఒకటైనా తరువాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలని ఉద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురుడినికి దొరకకుండా అగ్నిలో పిండాన్ని దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గృహాలో దాక్కుంటాడు.                           
 

ఈలోపు శివ తేజస్సుని భరించలేక అగ్ని ఆ పిండాన్ని గంగాదేవికి ఇచ్చి వేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెళ్ళ పొదలలో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని ఆరుగురు కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు.                       
 

ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి కుమారస్వామి పుట్టుకను తెలుసుకొని దేవతలకు పిల్లలు పుట్టరని శపిస్తుంది. కృత్తికల దగ్గరకు వెళ్లి ఆ తేజస్సు తనదని కాబట్టి బిడ్డ తన వాడే అని చెప్పి పార్వతిదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది.                                         
 

పెరిగి పెద్దవాడైన కుమారస్వామి తారకాసురుని సంహరించే సమయంలో ఈ పార్వతీదేవి స్కందమాతగా కుమార స్వామిని దీవిస్తుంది. అప్పుడు కుమారస్వామి తారకాసురుని సంహరిస్తాడు. 
 

అమ్మవారి ధ్యాన శ్లోకం"సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ".ఈ మాతను ఈ ధ్యాన శ్లోకంతో పూజించిన సకల సిద్ధులు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం, పిల్లలలో యశస్సు, విద్య, ఆరోగ్యం, సర్ప దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.                             

ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం సమర్పిస్తారు. నవరాత్రులలో 5వ రోజు అమ్మవారు మనకు స్కందమాతగా శ్రీశైలంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారి ఆలయం వారణాసి లో కూడా ఉంది.

click me!