Navratri: శరన్నవరాత్రులలో నాలుగో రోజు.. కూష్మాండ దుర్గాగా దర్శనమిచ్చిన అమ్మవారు

First Published Oct 10, 2021, 9:49 AM IST

Navratri: ఈరోజు నవరాత్రుల్లో 4వ రోజు.. అమ్మవారు కుష్మాండ దుర్గ అవతారంలో దర్శనమిస్తారు.ఆశ్వీయుజ శుద్ధ చవితి కాబట్టి భక్తులందరూ ఈరోజు  కుష్మాండ దుర్గా అమ్మవారిని పూజిస్తారు.

Navratri: ఈరోజు నవరాత్రుల్లో 4వ రోజు.. అమ్మవారు కుష్మాండ దుర్గ అవతారంలో దర్శనమిస్తారు.     ఆశ్వీయుజ శుద్ధ చవితి కాబట్టి భక్తులందరూ ఈరోజు  కుష్మాండ దుర్గా అమ్మవారిని పూజిస్తారు. ఇక ఈ అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.                                     
 

సంస్కృతం నందు కుష్మాండ అనగా గుమ్మడి కాయ. కుష్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరం."కు" అంటే చిన్న, "ఊష్మ"అంటే శక్తి, "అండ"అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని అర్థం. కుష్మాండ దుర్గా అమ్మవారిని అష్టభుజ దేవి అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. 
 

కూష్మాండ దుర్గా దేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి లేదా సింహం. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికి ప్రతీక.                                
 

విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది ఈ అమ్మవారు. సూర్యునికి ప్రకాశవంతమైన, కాంతివంతమైన వెలుగు రావుటకు కారణం ఈవిడ శరీరం.
 

అమ్మవారి శరీరం నుంచి వచ్చే కాంతి సూర్యుని యొక్క కాంతిలాగా బహిర్గతమవడంతో అన్ని దిక్కులకు వెలుగు వ్యాపిస్తుంది. సూర్యునికి వెలుతురును ఇచ్చింది కుష్మండ అమ్మవారి అని పురాణాలు తెలుపుతాయి.
 

సూర్యుని మధ్యభాగంలో ఈ అమ్మవారు నివాసం ఉంటుందని పురాణగాథలు తెలియజేస్తాయి. నవరాత్రుల్లో 4వ రోజు సాధకుని మనస్సు అనాహత చక్రము నందు స్థిరం అగును. కావున ఈ రోజున పవిత్రమైన నిశ్చలమైన మనస్సుతో స్వరూపమును ధ్యానిస్తూ పూజ చేయాలి.
 

ఈరోజు పటించవలసిన ధ్యాన శ్లోకం "సురా సంపూర్ణ కలశం రుధిరప్లుత మేవ చ దధాన హస్త పధ్మాభ్యాo కుష్మాండా శుభదాస్తు మే". అమ్మవారిని ఈ శ్లోకంతో ఈరోజు పూజించుట వల్ల శుభం కలుగుతుంది.
 

ఈ అమ్మవారిని ఈ రోజు పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం శక్తి లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారికి  అలంకరణగా బంగారపు వర్ణము ఉన్నటువంటి పసుపు చీరను సమర్పిస్తారు. ఈ అమ్మవారికి మొక్కజొన్న వడలు, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అమ్మవారి ఆలయం వారణాసి మరియు కాన్పూర్ లో ఉంది.

click me!