Navratri: ఈరోజు నవరాత్రులలో రెండవ రోజుగా అమ్మవారు బ్రహ్మచారిణీ దుర్గ అవతారంలో దర్శనమిస్తారు. గురువు వద్ద బ్రహ్మచార్య ఆశ్రమంలో తోటి విద్యార్థులతో ఉండే అమ్మవారి అవతారం.
ఈ అమ్మవారు తెల్లని చీరను ధరిస్తుంది. కుడి చేతిలో జపమాల కమండలం, ఎడమచేతిలో కలశం ధరించి ఉంటుంది. ఈ రోజు ఈ అమ్మవారిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.
బ్రహ్మచారిణీ అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. బ్రహ్మ అంటే జ్ఞానం. చారిణి అంటే స్త్రీ రూపం, ఒక పనిలో నిమగ్నమవ్వడం. బ్రహ్మచారిణీ అంటే బ్రహ్మచర్యం లో ఉన్నదని అర్థం. మరో అర్థం వివాహం కాని అమ్మాయి.
హిమవంతుని కూతురు అయిన పార్వతీ దేవి ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుని పతిగా పొందుటకు నారదుని ఉపదేశమును అనుసరించి ఘోరతపస్సు ఆచరించింది.
అనేక వేల సంవత్సరాలు నిరాహారంగా నీటిని కూడా ముట్టకుండా తపస్సును ఆచరించింది . ఆకులను కూడా భుజించక పోవుట వలన ఈమెకు అపర్ణ అనే పేరు ఏర్పడింది.
వేల సంవత్సరాల కొద్దీ కఠినమైన తపస్సుకు కొనసాగించు వలన బ్రహ్మచారిణీ దేవి యొక్క శరీరం పూర్తిగా క్షీణించింది. ఈ పరిస్థితి చూసిన ఆమె తల్లి మీనా దేవి దుఃఖించింది.
తల్లి మీనా దేవి తపస్సు నుంచి విరమించుటకు తల్లి ఉమా బిడ్డ అని పలికింది. బ్రహ్మచారిణీ దేవి ఉమాదేవి అని ప్రసిద్ధి పలికింది. బ్రహ్మదేవుడు ఈమె చేసిన తపస్సుకు ప్రసన్నుడై ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంతో ఇలా పలుకుతాడు.
దేవి ఘోరమైన ఇటువంటి తపస్సు ఇంతవరకు ఎవరు ఆచరించలేదు. ఇది నీకే సాధ్యమైయినది. నీ మనోవాంఛ పూర్తిగా నెరవేరింది. చంద్రమౌళి అయినా ఆ పరమేశ్వరుడు అవశ్యంగా నీకు పతి అగును అని పలుకుతాడు.
ఇక ఈ రోజు ఈ అవతారం లో దర్శన మిస్తూ భక్తులచే పూజలు అందుకుంటుంది. ఈరోజు ఈ అమ్మవారికి నైవేద్యంగా పెరుగు అన్నంలో పంచదార కలిపి పెడతారు మరియు పులిహోర పెడతారు. ఈ అమ్మవారి ఆలయం వారణాసిలో ఉంది.