narak chaturdashi 2023 : హిందూ మతంలో నరక చతుర్దశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజును ఛోటి దీపావళి అని కూడా అంటారు. ఇది దీపావళికి ముందు రోజు వస్తుంది. రోజు ఎంతో మంది దేవతలను పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు చాలా మంది ఎన్నో మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలను కూడా చేస్తారు. ఈ రోజు దేవుళ్లను పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయనే నమ్మకం ఉంది.
నరక చతుర్దశి తేదీ, సమయం
చతుర్దశి తిథి ప్రారంభం - నవంబర్ 11 - 01:57
చతుర్దశి తిథి ముగింపు - నవంబర్ 12 - 02:27
నరక చతుర్దశి ప్రాముఖ్యత
సనాతన ధర్మంలో నరక చతుర్దశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం.. ఈ రోజు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి 16000 మంది గోపికలను రక్షించాడు. అందుకే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నరక చతుర్దశి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునాడు శ్రీకృష్ణుడిని పూజిస్తారు.
శ్రీకృష్ణుని మంత్రం
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
కృష్ణయ్ వాసుదేవాయ హరయే పరమాత్మే. ప్రాణాత్ కాష్ణాయ గోవిందాయ నమో నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
నరక చతుర్దశి ఆచారాలు
నరక చతుర్ధశి నాడు ప్రజలు తమ ఇంటిని శుభ్రం చేసి పూలు, దీపాలు, ఇతర అలంకరణ సామగ్రితో అందంగా ముస్తాబు చేస్తారు. అలాగే శ్రీకృష్ణుడి ముందు దీపం వెళిగించి ఖీర్, హల్వా, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు సమర్పిస్తారు. చివరగా గోపాలుడి ఆశీస్సులు తీసుకుని సాయంత్రం వేళ ఇంట్లో 11 మట్టి దీపాలను వెలిగిస్తారు.