mokshada ekadashi 2023: సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి ఉన్నాయి. అలాగే మోక్షద ఏకాదశి సంవత్సరంలో చివరి ఏకాదశి. మోక్షద ఏకాదశిని మార్గశిర్ష మాసంలోని శుక్లపక్షంలో మోక్షద ఏకాదశి లేదా ఏకాదశి తిథి అని కూడా పిలుస్తారు. సనాతన పంచాంగం ప్రకారం.. ఈసారి మోక్షద ఏకాదశి డిసెంబర్ 22 అంటే ఈ రోజే వచ్చింది. ఈ రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున ఈ భగవంతుడిని పూజించడం వల్ల పుణ్యఫలాలు దక్కుతాయని నమ్ముతారు. అలాగే చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఈరోజు కొన్ని పనులు చేయడం నిషిద్ధం. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మోక్షద ఏకాదశి రోజున చేయవల్సిన, చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
lord vishnu 001
మోక్షద ఏకాదశి రోజున ఏం చేయాలి?
ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి విష్ణుమూర్తిని పూజించాలి.
తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయాలి.
పేదవారికి దానం చేయాలి.
వీటితో పాటు భజనలు, కీర్తనలు చేయాలి.
ఉపవాస సమయంలో రోజంతా ఏమీ తినకూడదు. మరీ మీకు చేతకాకపోతే పండ్లను తినొచ్చు.
మోక్షద ఏకాదశి రోజున ఏం చేయకూడదు?
ఏకాదశి నాడు అన్నం తినకూడదు.
ఈ రోజు హెయిర్ కట్ చేయించుకోవడం అశుభంగా భావిస్తారు.
ఉపవాసం ఉన్నవారు ఉదయం పొద్దుపోయే వరకు నిద్రపోకూడదు.
ఈ రోజున దొంగతనం, హింస, కోపానికి దూరంగా ఉండాలి.
అలాగే తులసి ఆకులు, పువ్వులను కోయకూడదు.
మోక్షద ఏకాదశి ప్రాముఖ్యత
మోక్షద ఏకాదశి ఉపవాసం ఉండి లోకానికి అధిపతి అయిన విష్ణుమూర్తిని పూజించడం వల్ల పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. మత విశ్వాసం ప్రకారం.. శ్రీకృష్ణుడు మోక్షద ఏకాదశి రోజున అర్జునుడికి గీతను బోధించాడు. అందుకే ఈ రోజున గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గీత పారాయణం లేదా వినడం శుభ ఫలితాలను ఇస్తుంది.