మోక్షద ఏకాదశి నాడు ఎలాంటి నియమాలను పాటించాలి?

First Published | Dec 21, 2023, 4:27 PM IST

mokshada ekadashi 2023: మోక్షద ఏకాదశికి సనాతన ధర్మంలో ఎంతో ధార్మిక ప్రాముఖ్యత ఉంది. శ్రీమహావిష్ణువు పూజకు ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలనుకునే వారు ఈ రోజు విష్ణువును పూజించాలి. దీనివల్ల సమస్త ప్రాపంచిక సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయి. 
 

mokshada ekadashi 2023: మోక్షద ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే దీన్ని ఎంతో ముఖ్యమైందిగా భావిస్తారు. ఈ మోక్షదా ఏకాదశి విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజు చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. అలాగే  విష్ణువును ఆరాధిస్తారు. మార్గశిర్ష మాసంలోని శుక్లపక్షం ఏకాదశి రోజున మోక్షద ఏకాదశి ఉపవాసం ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 22 అంటే శుక్రవారం నాడు జరుపుకుంటారు. 
 

Mokshada Ekadashi 2023

మోక్షద ఏకాదశి తేదీ, సమయం

ఏకాదశి తిథి ప్రారంభం - 22 డిసెంబర్ 2023 - 08:16

ఏకాదశి తిథి ముగింపు - 23 డిసెంబర్ 2023 - 07:11

పారణ సమయం - 24 డిసెంబర్ 2023 - ఉదయం 06:18 నుంచి 06:24 గంటల వరకు ఉంటుంది


Mokshada Ekadashi 2023

మోక్షద ఏకాదశి పర్వదిన నియమాలు

మోక్షద ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేవాలి. 
పుణ్యస్నానాలు ఆచరించాలి.
ఇంట్లోని ఆలయాన్ని శుభ్రం చేయాలి.
శ్రీమహావిష్ణువును నియమాల ప్రకారం పూజించాలి. 
విష్ణుమూర్తికి  నైవేద్యాలను సమర్పించండి.
తర్వాత దేవుడికి హారతి ఇవ్వండి.

Mokshada Ekadashi 2023

తర్వాత దేవుడికి హారతి ఇవ్వండి.
చివరగా ప్రసాదంతో మీ ఉపవాసాన్ని ఆచరించండి.
మీకు చేతనైనంత పేదలకు సాయం చేయండి.
తమాసిక ఆహారాన్ని మర్చిపోయి కూడా తినకూడదు.  ఒకవేళ ఈ ఆహారాన్ని తిన్న కూడా ఉపవాసాన్ని ప్రారంభించవద్దని గుర్తుంచుకోండి. లేకపోతే ఉపవాసం ఉన్న పుణ్య ఫలం కూడా దక్కదు. 
 

మోక్షద ఏకాదశి ప్రాముఖ్యత

సనాతన ధర్మంలో మోక్షద ఏకాదశికి ఎంతో ధార్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణువు ఆరాధనకు పవిత్రమైనదిగా భావిస్తారు. విష్ణువు అనుగ్రహం పొందాలనుకునే వారు ఈ రోజున ఆయనను ఆరాధించాలి. దీని ప్రభావం సమస్త ప్రాపంచిక సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను కలిగిస్తుంది. అంతే కాకుండా మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. వైకుంఠధామంలో విష్ణువు ఆయనకు స్థానం ప్రసాదిస్తాడని నమ్ముతారు.

Latest Videos

click me!