మోక్షద ఏకాదశి తేది? పూజా నియమాలు మీకోసం..

First Published Dec 21, 2023, 9:48 AM IST

mokshada ekadashi 2023: మోక్షద ఏకాదశిని మార్గశిర్ష మాసం శుక్లపక్షంలో  జరుపుకుంటారు. ఈ మోక్షద ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరం మోక్షదా ఏకాదశిని డిసెంబర్ 22 న అంటే శుక్రవారం నాడు జరుపుకోనున్నారు. 
 

mokshada ekadashi 2023: శ్రీ హరికి అంకితం చేయబడిన ఏకాదశి తేదీకి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు చాలా మంది భక్తులు విష్ణువుమూర్తి అనుగ్రహం కోసం నిష్టగా ఉపవాసం ఆచరిస్తారు. మార్గశిర్ష మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. అయితే మీరు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటున్నట్టైతే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అవేంటంటే? 
 

నియమాలు

మోక్షదా ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేవాలి. తర్వాత స్నానమాచరించి విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజున మీరు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే ఈ సమయంలో ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. తర్వాత తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు.
 

Mokshada Ekadashi 2023

మోక్షదా ఏకాదశి నాడు  శ్రీ హరి అనుగ్రహం పొందడానికి.. ఈ రోజు మీ శక్తి మేరకు పేదలకు దానం చేయండి. వీటితో పాటుగా ఈ రోజున భజన కీర్తనలు చేయడం వల్ల కూడా పుణ్య ఫలాలు దక్కుతాయనే నమ్మకం ఉంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అయినప్పటికీ.. మీకు వీలు కాకపోతే ఉపవాసం ఉండకున్నా ఏం కాదు. 
 

Mokshada Ekadashi 2023

మోక్షదా ఏకాదశి నాడు మీరు మర్చిపోయి కూడా తులసి మొక్కకు నీటిని సమర్పించకండి. ఎందుకంటే ఈ రోజున తులసి మాత విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. అలాగే ఈ ఏకాదశి నాడు తులసి ఆకులను అస్సలు తెంపకూడదు. 
 

Mokshada Ekadashi 2023

అలాగే ఏకాదశి నాడు అన్నం తినడం నిషిద్దం. అలాగే ఈ రోజున జుట్టు, గోర్లను కత్తిరించడం శుభప్రదంగా పరిగణించబడదు. అంతేకాదు ఈ రోజు హింస, దొంగతనం, హింస, కోపానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల మీ ఉపవాసాన్ని విరమించండి.దీంతో మీకు విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. 

click me!