Mahashivratri: మహాశివరాత్రి రోజు 10 నిమిషాలు ఇలా చేస్తే చాలు.. అన్నీ శుభాలే!

Published : Feb 20, 2025, 04:40 PM IST

Mahashivratri: పరమ శివుడి అనుగ్రహం కలగాలంటే మహాశివరాత్రి రోజు జస్ట్ 10 నిమిషాలు ఇలా చేస్తే చాలు. మీ కోరికలను మహా శివుడు నెరవేరుస్తాడు. 10 నిమిషాల్లో పరమశివుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
14
Mahashivratri: మహాశివరాత్రి రోజు 10 నిమిషాలు ఇలా చేస్తే చాలు.. అన్నీ శుభాలే!

ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26, బుధవారం వచ్చింది. ఆ రోజు భక్తులు మహాదేవుడి అనుగ్రహం పొందడానికి వివిధ రకాల పూజలు చేస్తారు. మహాశివరాత్రి రోజు శివుడిని పూజిస్తే ప్రత్యేక ఫలితాలు ఉంటాయని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజు పాలాభిషేకాలు, బిల్వార్చనలు లాంటి ప్రత్యేక పూజలు చేస్తే పరమశివుడి అనుగ్రహం కలిగి కోరికలు నెరవేరతాయని పండితులు కూడా చెబుతున్నారు.

24

మరి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేయలేని వారు కేవలం 10 నిమిషాల సమయం కేటాయించి శివ చాలీసా చదివితే చాలు. అయితే శివ చాలీసాను పూర్తి భక్తిశ్రద్ధలతో పఠిస్తే ఆగిపోయిన పనులన్నీ సక్రమంగా జరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ పరిహారం చేయడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మహా శివరాత్రి రోజు పఠించాల్సిన శివ చాలీసా ఇక్కడ ఉంది. 

34

దోహా
జయ గణేశ గిరిజా సువన, మంగళ మూల సుజాన |
కహత అయోధ్యాదాస తుమ, దేహు అభయ వరదాన ||

చౌపాయి
జయ గిరిజా పతి దీన దయాళా | సదా కరత సంతన ప్రతిపాలా ||
భాల చంద్రమా సోహత నీకే | కానన కుండల నాగఫనీ కే ||
అంగ గౌర శిర గంగ బహాయే | ముండమాల తన క్షార లగాయే ||
వస్త్ర ఖాల బాఘంబర సోహే | ఛవి కో దేఖి నాగ మన మోహే ||
మైనా మాతు కీ హవే దులారీ | బామ అంగ సోహత ఛవి న్యారీ ||
కర త్రిశూల సోహత ఛవి భారీ | కరత సదా శత్రున క్షయకారీ ||
నంది గణేశ సోహై తహ౦ కైసే | సాగర మధ్య కమల హై౦ జైసే ||
కార్తీక శ్యామ ఔర గణరావూ | యా ఛవి కో కహి జాత న కావూ ||
దేవన జబహీ౦ జాయ పుకారా | తబ హీ దుఖ ప్రభు ఆప నివారా ||
కియా ఉపద్రవ తారక భారీ | దేవన సబ మిలి తుమ్హి౦ జుహారీ ||
తురత షడానన ఆప పఠాయవూ | లవనిమేష మహ౦ మారి గిరాయవూ ||
ఆప జలంధర అసుర సంహారా | సుయశ తుమ్హార విదిత సంసారా ||
త్రిపురాసుర సన యుద్ధ మచాయీ | సబహి౦ కృపా కర లీన బచాయీ ||
కియా తపహి౦ భాగీరథ భారీ | పురబ ప్రతిజ్ఞా తాసు పురారీ ||
దానిన మహ౦ తుమ సమ కోవూ నాహీ౦ | సేవక స్తుతి కరత సదాహీ౦ ||
వేద నామ మహిమా తవ గాయీ | అకథ అనాది భేద నహి౦ పాయీ ||
ప్రకటీ ఉదధి మంథన మే౦ జ్వాలా | జరత సురాసుర భయే విహాలా ||
కీన్హీ దయా తహ౦ కరీ సహాయీ | నీలకంఠ తబ నామ కహాయీ ||
పూజన రామచంద్ర జబ కీన్హా | జీత కే లంక విభీషణ దీన్హా ||
సహస కమల మే౦ హో రహే ధారీ | కీన్హ పరీక్షా తబహి౦ పురారీ ||
ఏక కమల ప్రభు రాఖేఉ జోయీ | కమల నయన పూజన చహ౦ సోయీ ||
కఠిన భక్తి దేఖీ ప్రభు శంకర | భయే ప్రసన్న దియే ఇచ్చిత వర ||
జయ జయ జయ అనంత అవినాశీ | కరత కృపా సబ కే ఘటవాసీ ||
దుష్ట సకల నిత మోహి సతావై | భ్రమత రహౌ౦ మోహి చైన న ఆవై ||
త్రాహి త్రాహి మై౦ నాథ పుకారో | యేహి అవసర మోహి ఆన ఉబారో ||
లై త్రిశూల శత్రున కో మరో | సంకట సే మోహి ఆన ఉబారో ||
మాత-పితా భ్రాతా సబ హోయీ | సంకట మే౦ పూఛత నహి౦ కోయీ ||
స్వామీ ఏక హై ఆస తుమ్హారీ | ఆయ హరహు మమ సంకట భారీ ||
ధన నిర్ధన కో దేత సదా హీ౦ | జో కోయీ జాంచే సో ఫల పాహీ౦ ||
అస్తుతి కేహి విధి కరై౦ తుమ్హారీ | క్షమహు నాథ అబ చూక హమారీ ||
శంకర హో సంకట కే నాశన | మంగళ కారణ విఘ్న వినాశన ||
యోగీ యతి ముని ధ్యాన లగావై౦ | శారద నారద శీశ నవావై౦ ||
నమో నమో జయ నమః శివాయ | సుర బ్రహ్మాదిక పార న పాయ ||
జో యహ పాఠ కరే మన లాయీ | తా పర హోత హై శంభు సహాయీ ||
ఋనియా౦ జో కోయీ హో అధికారీ | పాఠ కరే సో పావన హారీ ||
పుత్ర హీన కర ఇచ్చా జోయీ | నిశ్చయ శివ ప్రసాద తేహి హోయీ ||
పండిత త్రయోదశీ కో లావే | ధ్యాన పూర్వక హోమ కరావే ||
త్రయోదశీ వ్రత కరై హమేషా | తాకే తన నహీ౦ రహై కలేశా ||
ధూప దీప నైవేద్య చఢావే | శంకర సమ్ముఖ పాఠ సునావే ||
జన్మ జన్మ కే పాప నసావే | అంత ధామ శివపుర మే౦ పావే ||
కహై౦ అయోధ్యాదాస ఆస తుమ్హారీ | జాని సకల దుఃఖ హరహు హమారీ ||

దోహా
నిత్త నేమ కర ప్రాతః హీ, పాఠ కరౌ౦ చాలీసా |
తుమ మేరీ మనోకామనా, పూర్ణ కరో జగదీశ ||
మగసర ఛఠి హేమంత ఋతు, సంవత చౌసఠ జాన |
అస్తుతి చాలీసా శివహి, పూర్ణ కీన కళ్యాణ ||
 

44

శివ చాలీసా పఠించడానికి నియమాలు..

మహాశివరాత్రి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శివ చాలీసా పఠించడం కోసం మహాశివుడి విగ్రహం ముందు కూర్చొని దీపారాధన చేసి సంకల్పం చెప్పండి. మనసులో ఏదైనా కోరిక ఉంటే అది సంకల్పంలో చెప్పండి.

శివుడి విగ్రహానికి లేదా చిత్రానికి పూలమాల వేయండి. స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించండి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త మొదలైనవి మీకు అందుబాటులో ఉన్న పూలతో శివనామాలు పఠిస్తూ పూజించండి. 

చివరిగా ఒక ఆసనంపై స్థిరంగా కూర్చుని శివ చాలీసా పఠించడం ప్రారంభించండి. ఎటువంటి ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా స్వచ్ఛమైన మనస్సుతో శివ చాలీసా చదవండి. శివ చాలీసా పఠించే సమయంలో దీపం వెలుగుతూ ఉండాలి.

మహాశివరాత్రి రోజున ఈ విధంగా చేయడం వల్ల మీరు అనుకున్న పనులకు అడ్డంకులు తొలగిపోయి పనులు చక్కగా జరుగుతాయి.

 

Read more Photos on
click me!

Recommended Stories