God Worship:దేవుడికి పూజ చేస్తుంటే చెడు ఆలోచనలు వస్తున్నాయా?

Published : Feb 05, 2025, 04:15 PM IST

 దేవుడికి పూజ చేస్తున్న సమయంలో, దేవుడిని గుడిలో దర్శించుకుంటున్న సమయంలో ఇలాంటి ఆలోచనలు వస్తే ఏమౌతుంది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..  

PREV
13
God Worship:దేవుడికి పూజ చేస్తుంటే చెడు ఆలోచనలు వస్తున్నాయా?

దేవుడికి భక్తిగా పూజ చేయాలని ప్రతి ఒక్కరూ చెబుతారు. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు రాకూడదని, మనస్ఫూర్తిగా ఆ దేవుడిని పూజించాలని చెబుతుంటారు. అలా పూజించినప్పుడు మాత్రమే ఆ దేవుడి ఆశీస్సలు మన మీద ఉంటాయని, ఆయన మనం కోరుకున్నవి నిజం చేస్తారు అని కూడా అనుకుంటారు. కానీ ఒక్కోసారి.., మనం ఎంత శ్రద్ధ చూపించాలి అనుకున్నా కూడా దేవుడి మీద ఆ శ్రద్ధ చూపించలేం. వేరే ఇతర ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. గుడికి వెళ్తే... బయట విప్పిన చెప్పులు ఉన్నాయో లేదో అని ఆలోచించేవారు కొందరైతే..ఏదైనా సినిమా గురించో.. ఇంకేవో ఇలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొందరికైతే ఏకంగా శృంగార సంబంధిత ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా దేవుడికి పూజ చేస్తున్న సమయంలో, దేవుడిని గుడిలో దర్శించుకుంటున్న సమయంలో ఇలాంటి ఆలోచనలు వస్తే ఏమౌతుంది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
 

23

పూజ సమయంలో శృంగార ఆలోచనలు..

పూజ సమయంలో మీ మనస్సులో అకస్మాత్తుగా ఏదైనా శృంగార ఆలోచనలు తలెతతింది అంటే... మీ మనసు, శరీరం రెండూ స్వచ్ఛమైనవి కాదు అని అరథమట. వాస్తవానికి శృంగార ఆలోచనలు రావడం తప్పు కాదు.  ఈ భావన వివాహికక జీవితంలో ఒక అంతర్భాగం.  కానీ.. కామ వాంఛ మనస్సులో బాగా పెరిగిపోయి ఆఖరికి పూజ సమయంలో కూడా రావడం మంచిది కాదు. అది కూడా పరాయి వ్యక్తిపై ఇలాంట ఆలోచనలు రావడం మరింత తప్పు. మీ భాగస్వామిపై అలాంటి ఆలోచనలు వస్తే అందులో ఎలాంటి తప్పు లేదు.

33

పూజ సమయంలో మనస్సులో కోపం భావం

పూజ సమయంలో మనస్సులో కోపం  లేదా అసూయ లాంటివి రావడం మొదలౌతే ఇది కూడా సరైనది కాదు. పూజ సమయంలో కోపం కూడా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. పూజ చేస్తున్నప్పుడు మీరు దేవునిపై కోపంగా ఉంటే, అది మీ భక్తి ,విశ్వాసం  పిలుపు రూపంలో ఉంటుంది.

మరోవైపు, ప్రార్థన చేస్తున్నప్పుడు, కోపం, అసూయ లేదా వేరొకరి పట్ల ప్రతికూల ఆలోచనలు అనుభూతి చెందడం దేవుని నుండి మీకు దూరాన్ని సూచిస్తుంది. దీని అర్థం దేవుడు మీ చెడు పనుల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ చెడు పనులను , ఇతరుల పట్ల ప్రతికూల ఆలోచనలను నియంత్రించుకోవాలి.
 

click me!

Recommended Stories