jyothir12
జ్యోతిర్లింగం అంటే శివుడు లింగ రూపంలో ఉండే చోటు. సామాన్యులు కూడా తనను పూజించేందుకు, ఆరాధించడానికి అణువుగా ఉండేందుకే ఆ పరమేశ్వరుడు ఇలా లింగ రూపం దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి. మనదేశంలో 12 చోట్ల జ్యోతిర్లింగాలను నెలకొల్పారు. ఈ జ్యోతిర్లింగాల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఈ మహా శివరాత్రికి అక్కడికి వెళ్లే వారు ఎంతో మంది ఉన్నారు. వాటి విశేషాలు తెలుసుకుందాం పదండి..
somanatha
సోమనాథ్ ఆలయం: మన దేశంలో 12 చోట్ల నెలకొల్పబడిన జ్యోతిర్లింగాలలో సోమనాథ్ దేవాలయం మొదటిది. ఈ ఆలయం గుజరాత్ లోని సౌరాష్ట్ర జిల్లాలో ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే.. ఈ దేవాలయానికి వచ్చిన శ్రీకృష్ణుడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి కూడా వెలిగుతూనే ఉంది. కాగా ఈ దేవాలయం దగ్గరున్న చంద్రకుండంలో తలస్నానం చేసి సోమనాథున్ని దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు.
srisailam
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం: ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం కొండల్లో కొలువు దీరిన మల్లిఖార్జున స్వామి కోరిన మొక్కులను తీరుస్తాడని భక్తలు విశ్వసిస్తారు. శ్రీశైలంలో ఆ ఈశ్వరుడుడు గౌరీదేవి, భ్రమరాంబ తో కొలువుదీరాడు. ఈ శ్రీశైల మహాక్షేత్రం హైదరాబాద్ నుంచి 230 కి. మీ దూరంలో ఉంటుంది.
rameshwaralayam
శ్రీ రామేశ్వరాలయం: శ్రీ రామేశ్వరాలయం తమిళనాడులో ఉంది. రాముడు రావణుడిపై గెలిచినందుకు గుర్తింపుగా ఈ కట్టడ నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతుంటారు. కాగా రామేశ్వరంలో మొత్తం 64 నీటి ఆవాసాలున్నాయి. వీటిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయిని ప్రజలు విశ్వసిస్తారు.
omkareswar
శ్రీ ఓంకారేశ్వరుడు: ఓంకారేశ్వర పుణ్య క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఉంది. ఈ పుణ్య క్షేత్రానికి ఓంకారేశ్వర దేవాలయం అని పేరుపొందింది. ఈ క్షేత్రాలను ఆకాశం పైనుంచి చూసినట్టైతే మనకు ఓం ఆకారం కనిపిస్తదట.
mahakaleswaram
మహాకాలేశ్వరాలయం: శ్రీ మహా కాళేశ్వరాలయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ లో ఉంది. ఈ జ్యోతిర్లింగాలయం తాంత్రిక మంత్రాలతో నడుపబడుతోంది. ఈ మహా దేవుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు ఇక్కడున్న కాలభైరవుడికి మద్యం (ఆల్కహాల్) ను నైవేద్యంగా పెడతారట.
bhimeswar
శ్రీభీమేశ్వరుడు: భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యద్రి కొండలు పూణేకు 110 కి.మీ దూరంలో ఉంటుంది. అంటే కృష్ణానది ఉపనది అయిన భీమనది ఉద్భవించిన చోటులో శ్రీ భీమశంకరుడు వెలసాడు. ఈ ఆలయాన్ని 13 వ శాతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తోంది. కాగా ఈ లింగం కుంభకర్ణుడి కొడుకైన రాక్షస భీమున్ని నాశనం చేసే పరమేశ్వరుడి రూపంలో ఉంటుంది.
thrayambaka
శ్రీ త్రయంబకేశ్వరుడు: త్రయంబుకేశ్వరాలయం మహారాష్ట్రలోని నాసిక్ కు 30 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం గురించి రెండు కథాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఒకటి బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా కొలువుదీరట.
naganath
శ్రీనాగనాథేశ్వరుడు: పాండవులు అరణ్యవాసంలో దారుకా వనంలో ఉన్నప్పుడు వారే ఈ దేవాలయాన్ని నిర్మించారని పురాణాల్లో ఉంది. ఈ ఆలయం విషయంలో కొంచెం వివాదం కూడా ఉంది. నాగనాథ జ్యోతిర్లింగంగా రెండు మూడు ఆలయాలను పిలుస్తూ ఉంటారు. కానీ నాగనాథేశ్వర ఆలయం బైత్ ద్వారక ద్వీపం , గోమతి ద్వారక ఆలయాలు చాలా ప్రసిద్ది పొందాయి.
vidyanath
శ్రీ వైద్యనాధేశ్వరుడు: శ్రీవైద్యనాధేశ్వరాలయం జార్ఖండ్ లో ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని పూజిస్తే సర్వ రోగాలు నయమవుతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.
vishwanatheswarudu
శ్రీవిశ్వనాథేశ్వరుడు: కాశీలో శ్రీ విశ్వనాథేశ్వరుడు కొలువు దీరాడు. ఈ పుణ్యక్షేత్రంంలో స్నానం చేసి ఆ పరమేశ్వరుణ్ని దర్శించుకోవడం వల్ల మరుజన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
kedernath
శ్రీ కేదారేశ్వరుడు: కేదారేశ్వరాలయం ఉత్తరాఖండ్ లో ఉంది. ఈ ఆలయం కేవలం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. పాండవులే ఈ ఆలయాన్ని నిర్మించారట.