Maha Shivaratri: శివయ్యను ఇలా పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట..

First Published | Feb 28, 2022, 2:47 PM IST

Maha Shivaratri: హిందువులు జరుపుకునే పండుగల్లో శివరాత్రి ఎంతో పవిత్రమైనది. ఈ పండుగ రోజున శివయ్యను నిష్టగా పూజిస్తే కోరిన వరాలను తీరుస్తాడట. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారు ఈ మహా శివరాత్రి రోజున ఇలా చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
 

Maha Shivaratri:ఫాల్గుణ మాసంలోకృష్ణ పక్షం చతుర్దశి నాడు మహా శివరాత్రి వస్తుంది. అంటే రేపే మహాశివరాత్రి పండుగ. ఈ పండుగ రోజున శివయ్యను ప్రసన్నం చేసుకుంటే.. మీరు పడుతున్న కష్టాలు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. 

జ్యోతిష్యం ప్రకారం.. శివరాత్రి నాడు ఇలా చేస్తే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయట. మరి శివరాత్రి రోజున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 

Latest Videos


మహా శివరాత్రి నాడే శివయ్య లింగరూపంలోకి ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి పవిత్రమైన మహాశివరాత్రి రోజున శివలింగ దర్శణం చేసుకుంటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. 

ముఖ్యంగా శివరాత్రి రోజున రాత్రంతా శివ నామస్మరణ చేసుకుంటూ జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 

మహాశివరాత్రి రోజున పరమేశ్వరునికి బిల్వ పత్రాన్ని తప్పకుండా సమర్పించాలని చెబుతున్నారు. అలాగే ఈ రోజున శివాలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయట.

శివరాత్రి నాడు శివలింగానికి పెరుగుతో రుద్రాభిషేకం చేస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయట. ముఖ్యంగా కైలాస నాథుడికి చెరుకు రసంతో అభిషేకిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
 

నెయ్యి, తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే సంపద పెరుగుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే శుభ వార్తలను కూడా వింటారట.
 

డబ్బు సమస్యలు తగ్గిపోవాలంటే శివరాత్రి నాడు సాయంత్రం పూట 108 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలట. దీనివల్ల డబ్బు సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయట. 

జాతకంలో గ్రహాల స్థితి బాగులేనప్పుడు శివరాత్రి నాడు శివలింగాన్ని ఆవుపాలతో అభిషేకించి శివనామ స్మరాన్ని జపించాలని పండితులు చెబుతున్నారు. 

వ్యాపారులకు లేదా ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే వారు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి.. శివలింగానికి తేనె కలిపిన నీటితో అభిషేకిస్తే చక్కటి ఫలితాలొస్తాయని పండితులు వెల్లడిస్తున్నారు. 

click me!