సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావనినమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం పొందితే ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదట. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మీ ఇంటి గుడిలో కొన్ని వస్తువులను పెట్టాలి. అవేంటంటే..?
peacock feather
నెమలి ఈకలు
నెమలి ఈకలను మీ ఇంటి గుడిలో పెట్టండి. ఎందుకంటే దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వీటితో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. అలాగే మీ సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. అలాగే లక్ష్మీదేవిని నిష్టగా పూజించండి.
గంగా నీటిని ఉపయోగించండి
మీ ఇంటి గుడిలో గంగాజలాన్ని కూడా ఉంచడం కూడా మంచిది. ఎందుకంటే హిందూమతంలో గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే గంగాజలాన్ని మీ ఇంటి గుడిలో పెట్టండి. దీంతో లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. హిందూ మతంలో శంఖాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. దక్షిణ శంఖాన్ని లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా భావిస్తారు. ఇలాంటప్పుడు ఈ శంఖంలో గంగాజలాన్ని నింపి ఇంటి గుడిలో పెట్టొచ్చు. దీనివల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు.
ఈ విగ్రహాలను ఆలయంలో ఉంచండి
శివలింగం శివునికి చిహ్నం. అందుకే మీ ఇంటి గుడిలో ఒక శివలింగాన్ని తప్పకుండా పెట్టండి. అలాగే క్రమం తప్పకుండా శివలింగాన్ని ఆరాధించండి. శివలింగానికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. హిందూ మతంలో మొదట పూజించే దేవుడు వినాయకుడు. అందుకే వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటి గుడిలో తప్పకుండా ఉంచాలి. విగ్రహం ముఖం ఉత్తర దిశ వైపు ఉండాలని గుర్తుంచుకోండి.