కార్తీక పౌర్ణమి తేదీ ఇదే.. ఆ రోజు ఇలా చేశారంటే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు

First Published | Nov 18, 2023, 4:29 PM IST

karthika purnima 2023: కార్తీక మాసం శ్రీహరికి అంకితం చేయబడింది. అలాగే పూర్ణిమ తిథిని కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి అవసరమైన వారికి వస్తువులను దానం చేయడం వల్ల విష్ణమూర్తి అనుగ్రహం పొందుతారు. 
 

karthika purnima 2023: పౌర్ణమి తిథి హిందూ మతంలో ఎంతో పవిత్రమైనది. ఈ రోజున ప్రజలు విష్ణువును ఆరాధిస్తారు. ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ 29 న ప్రారంభమైంది. ఈ కార్తిక మాసం విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. మరి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? ఆ సమయంలో ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

కార్తీక పౌర్ణమి తేది

హిందూ క్యాలెండర్ ప్రకారం.. కార్తీక పౌర్ణమి నవంబర్ 26 న అంటే ఆదివారం మధ్యాహ్నం 03:53 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే పూర్ణిమ తిథి నవంబర్ 27 సోమవారం మధ్యాహ్నం 02:45 గంటలకు ముగుస్తుంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని ఈ ఏడాది నవంబర్ 27న జరుపుకోనున్నారు. మరి కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 


ఈ పని ఖచ్చితంగా చేయండి

మత విశ్వాసాల ప్రకారం.. పౌర్ణమి నాడు పవిత్రనది స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది. అలాగే ఈ రోజున పేదలకు దానం చేయడం వల్ల పుణ్య ఫలాలను పొందుతారని చెప్తారు. ఈ రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన ఇంట్లోకే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. 
 

ఈ వస్తువులను దానం చేయండి

కార్తీక పౌర్ణమి నాడు బియ్యం, పంచదార, పాలు వంటి తెల్లని పదార్థాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారనే నమ్మకం ఉంది. హిందూ మతంలో దీప దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం పూట దీపదానం చేయండి. పూర్ణిమ నాడు ఇల్లంతా దీపాలు వెలిగించడం వల్ల సకల దుఃఖాలు తొలగిపోతాయని నమ్ముతారు.
 

ఈ తప్పులు చేయకండి..

కార్తీక పౌర్ణమి నాడు తులసి ఆకులను తెంపకూడదు. అలాగే ఈ రోజున మీరు మాంసాహారం తినకూడదు. ఈ రోజు సాత్విక ఆహారాన్నే తినాలి. అలాగే ఈ రోజు మందును తాగకూడదు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎవరినీ అవమానించకూడదు. కోపగించుకోకూడదు. ద్వేషించడం, దూషించడం మానుకోవాలి. దీనివల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది. 

Latest Videos

click me!