2024లో వచ్చే మొదటి కాలాష్టమి తేది ఇదే.. ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదంటే?

First Published | Dec 31, 2023, 9:38 AM IST

Kalashtami 2024: కాలాష్టమి రోజున కాలభైరవ దేవుడిని పూజించాలనే నియమం ఉంది. కాలాష్టమి రోజు రాత్రి తంత్ర శాస్త్రం నేర్చుకున్న వారు ప్రత్యేక పూజలు చేస్తారు. కాలాష్టమి రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధమని, అలా చేయడం వల్ల కాలభైరవుడికి కోపం వస్తుందని, దీనివల్ల జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. 
 

Kalashtami 2024: సనాతన ధర్మంలో కాలభైరవుడి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా కృష్ణపక్షం ఎనిమిదో రోజున కాలాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున కాలభైరవుడిని పూజించాలనే నియమం ఉంది. ఈ సారి 2024 సంవత్సరంలో మొదటి కాలాష్టమి జనవరి 4 న వచ్చింది. కాలాష్టమి రోజు రాత్రి తంత్ర శాస్త్రం నేర్చుకున్న అభ్యాసకులు ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే కాలాష్టమి రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధమని చెప్తారు. చేయకూడని పనులు చేయడం వల్ల కాలభైరవుడికి కోపం వస్తుందట. దీనివల్ల జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తారు. మరి కాలాష్టమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కాలాష్టమి రోజున ఏం చేయాలి?

కాలాష్టమి నాడు కాలభైరవుడికి నిమ్మకాయల మాల సమర్పించి ఆశీస్సులు తీసుకోవాలి. 

అలాగే ఈరోజు భక్తి శ్రద్ధలతో పేదలకు దానం చేయాలి.

కాలాష్టమి సందర్భంగా కాల భైరవుని స్తుతి పాడండి.

కాలాష్టమి నాడు కాలభైరవుడిని నియమాల ప్రకారం పూజించండి. 

కాల భైరవుడికి జిలేబీలు, స్వీట్లను సమర్పించాలి.
 


kalashtami

కాలాష్టమి రోజున ఏం చేయకూడదు?

కాలాష్టమి  నాడు ఎవరినీ అవమానించకూడదు.

అలాగే కాలభైరవుడిని పూజించడం కోసం ఎవరినీ నాశనం చేయకూడదు.

ఈ రోజు మాంసాహారం తినకూడదు. 

కాలాష్టమి నాడు పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.

ఏ జంతువును గానీ, పక్షిని గానీ ఇబ్బంది పెట్టకూడదు.
 

కాలాష్టమి ప్రాముఖ్యత

కాలాష్టమి కాల భైరవుడికి అంకితం చేయబడింది. కాలాష్టమి నాడు కాలభైరవుడిని పూజించడం వల్ల జీవితంలో చేసిన పాపాలు, కర్మ, దుఃఖం తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల కాల భైరవుని ఆశీస్సులు పొందుతారట.  అలాగే ఆయన అనుగ్రహం మనపై ఉంటుందనే నమ్మకం ఉంది. 

Latest Videos

click me!