ఈ ఏడాదిలో ఏప్రిల్ 3 వ తేదీ ఆదివారం నుంచి రంజాన్ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి మొదలుకుని 30 రోజులకు అంటే మే రెండో తారీఖున ఈ పండుగ ముగుస్తుంది. ఈ రంజాన్ పండుగ చందమామ కనిపించడంతో మొదలవుతుంది. ముస్లిం సోధరులకు ఈ రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైంది.
ramzan
అసలు రమదాన్ లేదా రంజాన్ అనేది ఈ ఫెస్టివల్ పేరే కాదు తెలుసా.. ఈ రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. తొమ్మిదో నెలే రంజాన్ మాసం. ముస్లింలు ఎంతో పవిత్రంగా కొలిచే ఖురాన్ గ్రంథం స్వర్గం నుంచి భూమికి ఈ రంజాన్ మాసంలోనే వచ్చిందని వీరు నమ్ముతారు.అందుకే ఈ పండుగ ముస్లింలకు చాలా పవిత్రమైంది.
ఈ పవిత్రమైన ఖురాన్ గ్రంథంలో మానవులను సన్మార్గంలో నడిపించే మార్గదర్శాలు, సత్య మార్గాలు ఉంటాయి. అందుకే ఈ మాసమంతా అందరూ విధిగా ఉపవాసం చేస్తారు. అలాగే మార్గనిర్దేశం చేసే పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని అందించినందుకు .. ప్రవక్తగా మహమ్మద్ ను నియమించినందుకు ఆ అల్లాహ్ కు ముస్లింలందరూ ఉపవాస దీక్షతో కృతజ్ఞతలు తెలియజేస్తారు.
Ramzan
ఉపవాస సమయాల్లో వారు నీళ్లు తప్ప ఎలాంటి ఆహార పదార్థాలను అస్సలు తీసుకోరు. ఈ సమయాల్లో వారు ఆగ్రహావేశాలకు లోనుకాకుండా శాంతంగా, నిగ్రహంగా ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో వారు పేదవాళ్లకు వాళ్లకు చేతనైన సాయం చేస్తారు కూడా. పొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో ఉపవాసం విడిచి పెడతారు.
Ramadan Ramzan
ఈ 30 రోజులు ఉపవాసం చేసేవారు సూర్యస్తమయం తర్వాతే ఉపవాసం ముగించి ఏదైనా తింటారు. మళ్లీ తిరిగి ఉపవాసం తెల్లవారు జామున మొదలవుతుంది. ఈ పద్దతినే ఇప్తార్ అంటారు.