Karthika Masam: కార్తీక మాసంలో ఎలాంటి వస్తువులు దానం చేయడం శుభప్రదమో తెలుసా?

Published : Oct 22, 2025, 04:11 PM IST

Karthika Masam: ఈ కార్తీక మాసాన్ని శివుడికి అంకితం చేశారు. దాదాపు అందరూ ఈ సమయంలో... శివాలయానికి వెళ్లి... దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే... ఈ పవిత్ర మాసంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. 

PREV
14
కార్తీక మాసం

హిందూ మతంలోని అన్ని నెలల్లో కంటే కార్తీక మాసం అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. ఈ కార్తీక మాసంలో శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తులసి మాతకు పూజించడం, దీపాలు వెలిగించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే.. కేవలం దీపాలు వెలిగించడమే కాకుండా, కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి, ఈ కార్తీక మాసంలో ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం....

24
కార్తీక మాసంలో దీపాలు నీటిలో వదలడం..

కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు నిద్రలేచి, స్నానం చేసి, నది లేదా చెరువులో వాటిని వదలాలి. ఇలా నీటిలో దీపాలను వదలడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు. సూర్యోదయానికి ముందే, తులసి మొక్క ముందు నెయ్యి లేదా, నూనె తో దీపం వెలిగించడం వల్ల కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

34
ఆహారం దానం చేయడం....

హిందూ మతంలో, ఆహారం దానం చేయడం గొప్ప దాన ధర్మంగా పరిగణిస్తారు. ఆహారం దానం చేయడం కంటే పవిత్రమైన దానం మరొకటి లేదు. కాబట్టి, కార్తీక మాసంలో మీరు పేదలకు వీలైనంత ఎక్కువగా ఆహారం, ఆహార పదార్థాలు, ధాన్యాలను దానం చేయాలి. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ గ్రంథాల ప్రకారం, భక్తితో ఆహారాన్ని పేదలకు దానం చేయడ వల్ల పుణ్యం లభిస్తుందని కూడా నమ్ముతారు.

44
7 రకాల ధాన్యాలు దానం చేయడం....

కార్తీక మాసంలో 7 రకాల ధాన్యాలను దానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి ఏడు జన్మల పాటు ఆనందం, శ్రేయస్సును పొందుతారు. అతను తన 7 జన్మలలో అపారమైన సంపద , ఆనందాన్ని పొందుతారు. ఏవైనా ఏడు రకాల ధాన్యాలను మీరు ఎంచుకోవచ్చు.

వివాహిత స్త్రీలు....

కార్తీక మాసం వివాహిత మహిళలకు కూడా చాలా పవిత్రమైన నెల. కార్తీక మాసంలో, వివాహిత స్త్రీలు గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, జాకెట్లు, చీరలు, పువ్వులు, గాజులు మొదలైన వాటిని దానం చేయాలి. వీటిని దానం చేయడం ద్వారా, భర్త ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు.

Read more Photos on
click me!

Recommended Stories