దేవతల కేబినెట్... రాష్ట్రపతి, ప్రధాని ఎవరు? ఏ దేవుడికి ఏ శాఖ?

Published : Jul 24, 2025, 09:44 AM ISTUpdated : Jul 24, 2025, 09:49 AM IST

హిందూ దేవతలతో ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది? ఓ డ్రైవర్ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకూ ఏ దేవుడు ఈ మంత్రిత్వ శాఖకు సరిపోతారో తెలుసా?

PREV
16
దేవతల ప్రభుత్వం ఇలాగే ఉంటుందేమో...

Tirumala : ఆనాటి రాజులకాలం నుండి ప్రస్తుత రోబో జమానా వరకు చాలా మారాయి... అడవుల్లో అహారం కోసం జంతువులను వేటాడే రోజులనుండి హాయిగా ఇంట్లోనే కూర్చుని ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే రోజులకు మనిషి చేరుకున్నాడు. ఆకాశంవైపు చూస్తూ చందమామ పాటలు పాడుకునే రోజులనుండి ఆ చంద్రుడిపైనే అడుగుపెట్టే స్థాయికి చేరుకున్నాడు. కానీ ఆనాటి నుండి ఇప్పటికీ మారనిది పరిపాలనా విధానం... అప్పుడు రాజులు, మంత్రులు ఉంటే ఇప్పుడు అలాగే ప్రధాని/ముఖ్యమంత్రి, మంత్రులున్నారు. కానీ అప్పుడు రాచరికం... ఇప్పుడు ప్రజాస్వామ్యం.

అయితే ఇప్పుడున్న పరిపాలనా వ్యవస్థలో హిందూ దేవుళ్ళు ఉంటే ఎలా ఉంటుంది... ఎవరికి ఏ పదవి, ఏ శాఖ సరిపోతుంది? దేవతల కేబినెట్ అంటూ ఓ డ్రైవర్ చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. సదరు డ్రైవర్ దేవతల మంత్రిమండలి గురించి సరదాగా చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు ఏ దేవుడికి ఏ శాఖ సరిపోతుందో చెప్పిన విధానం ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ మనంకూడా దేవతల కేబినెట్ గురించి తెలుసుకుందాం.

26
ఏ దేవుడికి ఏ మంత్రిత్వ శాఖ

ప్రెసిడెంట్ (రాష్ట్రపతి) వెంకటేశ్వరస్వామి

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి (విష్ణుమూర్తి) రాష్ట్రపతి పదవికి సరిగ్గా సరిపోతారు. ఆయన ఆపద సమయంలో దేవతలకే సాయం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి... రాష్ట్రపతి కూడా ప్రభుత్వం ఆపత్కాలంలో ఉన్నపుడు అధికారాలను కలిగివుంటారు. కాబట్టి ఈ విశ్వ ప్రభుత్వంలో శ్రీవారికి అత్యున్నత పదవి.

36
ప్రధానమంత్రి/ ముఖ్యమంత్రి ఈశ్వరుడు

దేవతల కేబినెట్ కు బాస్ ఈశ్వరుడు. ఈ సృష్టి లయకారుడు శివుడు... దేవతలందరిలో ఆయన చాలా పవర్ ఫుల్. అందుకే ఆయనకు ప్రధాని/ ముఖ్యమంత్రి వంటి అత్యున్నత స్థానం సరిపోతుంది.

ఆర్థిక శాఖ మంత్రి కుభేరుడు :

సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి నుండే డబ్బులు వసూలుచేసేది కుభేరుడు. సేమ్ ఇలాగే ప్రజల నుండి పన్నులు వసూలుచేయడం... దాన్ని ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చుచేయడం ఆర్థిక శాఖ పని. కాబట్టి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన శాఖ కుభేరుడికి సరిపోతుంది.

సమాచార శాఖ మంత్రి నారదుడు :

నారదుడు... ఓ దేవుడి నుండి మరో దేవుడికి సమాచారాన్ని మోసేది ఈయనే. ఈయనను కలహప్రియుడిగా పేర్కొంటారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేది కూడా సమాచార శాఖ మంత్రే. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఆండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ మంత్రిగా నారదుడు సరిపోతారు.

46
న్యాయశాఖ మంత్రి యముడు

అందరికీ సమానంగా న్యాయాన్ని అందించే బాధ్యత న్యాయశాఖ మంత్రిది. యవధర్మరాజు కూడా పేద, ధనిక తేడా చూడకుండా సమధర్మాన్ని పాటిస్తారు.... సమయం అయిపోతే ఎవరినైనా తీసుకెళతారు. అందుకే ఆయన న్యాయశాఖ మంత్రి.

విదేశీ వ్యవహారాల శాఖ దేవేంద్రుడిది :

దేవతల రాజు ఇంద్రుడు ఈ విశ్వ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సరిపోతారు.

వ్యవసాయ శాఖ వానదేవుడు :

మనం తినే ఆహారానికి వ్యవసాయమే ఆధారం. వరుణుడి కరుణలేనిదే పంటలు పండవు... అవి లేకుంటే మనకు అహారం ఉండదు. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా వానదేవుడు సరిపోతారు.

56
ఆరోగ్య శాఖ వాయుదేవుడు

మంచి ఆరోగ్యానికి స్వచ్చమైన గాలి చాలాముఖ్యం. ఊపిరి పీల్చుకోకుంటే మనిషి బ్రతకలేడు... అందుకే గాలిని ప్రాణవాయువు అంటారు. కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రి వాయుదేవుడు.

కుటుంబసంక్షేమ శాఖ బ్రహ్మదేవుడు :

మనిషికి ప్రాణం పోసేది బ్రహ్మదేవుడే అంటారు. కాబట్టి ఆయన కుటుంబసంక్షేమ శాఖ మంత్రి.

66
విద్యాశాఖ మంత్రి సరస్వతిదేవి

మహిళల కోటాలో చదువుల తల్లి సరస్వతి మాత విద్యాశాఖకు సరిపోతారు.

రక్షణ/ హోంశాఖ మంత్రి పార్వతీదేవి :

శక్తి స్వరూపిణి పార్వతీదేవికి డిఫెన్స్ లేదా హోంశాఖ మంత్రి.

ఆర్బిఐ బాధ్యతలు లక్ష్మీదేవివి :

ప్రస్తుతం డబ్బులకు సంబంధించిన వ్యవహారాలన్ని ఆర్బిఐ చూసుకుంటుంది. కాబట్టి ఈ బాధ్యతలు లక్ష్మీదేవి.

దేవతల కేబినెట్ గురించి సదరు డ్రైవర్ చెప్పిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories