భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. కానీ అవి పెరిగి పెద్దవైతేనే సమస్య. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. పడకగదిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దంపతుల మధ్య సమస్యలు రావట. వారి మధ్య ప్రేమ పెరిగే అవకాశం ఉందట. మరి ఆ మార్పులేంటో చూద్దామా..
ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. తర్వాత సర్దుకుపోవడం, సఖ్యతగా ఉండడం కూడా సహజమే. అయితే గొడవలు పెరిగి పెరిగి పెద్దవైతేనే సమస్య. దానివల్ల ఇంటి వాతావరణం కూడా దెబ్బతింటుంది. మరి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
27
ఇలా చేస్తే సమస్యే రాదు!
దంపతుల మధ్య సమస్యను పరిష్కరించడానికి లేదా సమస్యే రాకుండా ఉండటానికి చాలా సులభమైన పనులు చేస్తే చాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. దంపతులు ఉపయోగించే దుస్తులు, వస్తువుల రంగులు కూడా వారి మధ్య సమస్యను తగ్గిస్తాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.
37
పడక గదిలో మార్పులు..
ఇంటి పడకగదిలో కొన్ని మార్పులు చేస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా దిండు, బెడ్ షీట్ రంగులు మారిస్తే గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుందట.
దుప్పటి, బెడ్ కవర్లు.. లేత గులాబీ, లేత నీలం, తెలుపు లాంటి రంగుల్లో ఉంటే ప్రేమ, అనుబంధం పెరుగుతాయట. బూడిద, నలుపు, ఎరుపు రంగులు ఎక్కువగా వాడితే కోపం, గొడవలు, మానసిక ఒత్తిడి పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
57
దిండు రంగు
దిండు రంగు లేత గులాబీ రంగులో ఉంటే దంపతుల మధ్య కోపాలు తగ్గి ప్రేమ పెరుగుతుందట. దిండు రంగు ఆకుపచ్చగా ఉంటే ప్రశాంతత, నమ్మకం పెరుగుతాయట. లేత గులాబీ – ప్రేమ, సంతృప్తి ఆకుపచ్చ – ప్రశాంతత, నమ్మకం తెలుపు – పవిత్రత, మంచి సంబంధం
67
ఈ రంగు వద్దు!
దిండు రంగు సఖ్యతను పెంచుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముదురు ఎరుపు లేదా నలుపు రంగు దిండు దంపతుల మధ్య ఉద్రిక్తతను పెంచుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు.
77
రంగుల ప్రభావం ఎలా ఉంటుందంటే?
సాధారణంగా రంగులు మనసును ప్రభావితం చేసే కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. రంగు, దిశ, స్థలం మీ సంబంధానికి ప్రత్యక్ష కారణం కాకపోయినా.. మీ మనసు ప్రశాంతంగా ఉండటానికి ఇది బాగా పనిచేస్తుంది. మీకు సందేహం ఉంటే లేత రంగులను ఎంచుకొని ప్రయత్నించండి.