ప్రకృతిని ఎంజాయ్ చేయండి
మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తెచ్చేందుకు ముందు మీరుప్రకృతితో స్నేహం చేయండి. రోజులో కొంత సేపు చెట్లు, మొక్కలు, నదులు, కాలువలు ఇలా మీ పరిసరాల్లో ఏమి ఉంటే వాటి మధ్య తిరగండి. గడ్డిపైన, నీటిలోనూ చెప్పులు లేకుండా నడవండి. ప్రకృతిలో మీరు కలిసిపోతున్నట్టుగా, చుట్టూ ఉన్న వాతావరణం మీదేనన్నట్టుగా భావించి ఆనందించండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో నాడులు ఉత్తేజితమై మీకు కొత్త శక్తినిస్తాయి. తద్వారా మీ ఆరా మరింత శక్తివంతంగా మారుతుంది.